- Advertisement -
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో ఒకరు మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాలో తన అంద, చందాలతో మెప్పించింది ఈ బ్యూటీ. మీర్జాపూర్ యువరాణిగా అలాగే సీత పాత్రలో ఒదిగిపోయింది. ఆ తర్వాత తన కెరీర్‌లో వెనుదిరిగి చూడలేదు. రీసెంట్‌గా విజయ్‌తో ఫ్యామిలీ స్టార్ సినిమాతో హిట్ కొట్టింది ఈ బ్యూటీ.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తాను ప్రేమలో ఉన్నాననే అర్థం వచ్చేలా ట్వీట్ చేసింది మృణాల్. ఎక్స్‌లో ఒక హార్ట్ సింబల్‌ను పోస్ట్ చేసింది. దీంతో ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నానని చెప్పకనే చెప్పిందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై మృణాల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
మృణాల్ ప్రస్తుతం ప్రభాస్, హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్‌గా నటించందనే వార్తలు వస్తున్నాయి.