Monday, May 13, 2024
- Advertisement -

పెళ్లిపై మరింత క్లారిటీ ఇచ్చిన మృణాల్!

- Advertisement -

సీతారామం సినిమాతో దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది మృణాల్ ఠాకూర్‌.ఈ ఒక్క సినిమాతో దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన హాయ్ నాన్న విడుదల కాగా విజయ్‌తో ఫ్యామిలీ స్టార్ త్వరలో రిలీజ్ కానుంది.

ప్రస్తుతం ఆమె కెరీర్‌ మంచి జోష్ మీదుండగా మృణాల్ పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం న్యూ జెర్సీలో విజయ్‌తో ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై స్పందించింది మృణాల్.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ఎప్పుడు అనగా త్వరలోని అని చెప్పింది ఈ బ్యూటీ. అంతే అప్పటి నుండి మృణాల్‌ పెళ్లికి సంబంధించి రోజుకో గాసిప్‌తో రచ్చరచ్చ చేస్తుండగా పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచన లేదని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని, ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని అది పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ఇకనైన పెళ్లికి సంబంధించిన పుకార్లకు పుల్ స్టాప్ పెట్టాలని కోరింది. మరి ఇకనైనా ట్రోలర్స్ సైలెంట్ అవుతారో లేదో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -