Thursday, May 16, 2024
- Advertisement -

హారర్ సినిమా లో బిగ్ బాస్ కంటెస్టెంట్లు

- Advertisement -

ఒక సంగీత దర్శకుడిగా మున్నాకాశి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘మిస్టర్ 7′, చిత్రం చెప్పిన కథ’, ‘మామ ఓ చందమామ’ వంటి సినిమాలకు సంగీతం అందించిన మున్నా కాశీ ఇప్పుడు ‘హేజా’ సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ సంగీత దర్శకుడు మున్నా కాశీ ఇప్పుడు వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై కె వి ఎస్ ఎన్ మూర్తి నిర్మిస్తున్న ‘హేజా’ సినిమాతో ఇప్పుడు హీరోగా మారబోతున్నారు. ఐటెం సాంగ్స్ మరియు బిగ్ బాస్ సీజన్ వన్ తో పాపులర్ అయిన ముమైత్ ఖాన్ మరియు బిగ్ బాస్ 2 ఫేమ్ నూతన్ నాయుడు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు అని తెలుస్తోంది. హారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ “ఇప్పటి దాకా చాలా సినిమాలకు సంగీతం అందించాను. కానీ మొట్టమొదటిసారిగా హీరోగా మాత్రమే కాక దర్శకుడిగా కూడా మారి చేస్తున్న సినిమా ఇది” అని చెప్పుకొచ్చారు. మ్యూజికల్ హారర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ముమైత్ ఖాన్ మరియు నూతన్ నాయుడు పాత్రలు చాలా కొత్తగా మరియు స్పెషల్ గా ఉంటాయని మున్నాకాశి చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు
మున్నా కాశి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -