Thursday, May 9, 2024
- Advertisement -

సంగీత దర్శకుడు మణిశర్మ తండ్రి కన్నుమూత

- Advertisement -

సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ తండ్రి యనమండ్ర నాగయజ్ఞ శర్మ కన్నుమూశారు.చెన్నైలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వయోలిన్ విద్వాంసుడిగా నాగయజ్ఞ శర్మకు మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో, ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. మ‌ణిశ‌ర్మ తండ్రి నాగయజ్ఞ శర్మ వయోలిన్ విద్వాంసుడిగా ఖ్యాతి సంపాదించారు.

ఆయ‌న వార‌స‌త్వంగానే మ‌ణిశ‌ర్మ సంగీతం నేర్చుకున్నారు.మ‌ణిశ‌ర్మ తెలుగులో పెద్ద హీరోల‌కు సంగీతం అందించారు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, మ‌హేష్ బాబుకు సూప‌ర్ హిట్స్ ఇచ్చాడు. మ‌ణిశ‌ర్మ ప్ర‌స్తుతం పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు.కొన్ని సినిమాల‌కు నేప‌థ్య సంగీతం అందిస్తున్నారు.ఆయ‌న తండ్రి మృతి ప‌ట్ల తెలుగు ఇండ‌స్ట్రీ నివాళలు అర్పించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -