Sunday, May 19, 2024
- Advertisement -

టీజ‌ర్‌తో వ‌చ్చిన తేజు

- Advertisement -

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కొత్త సినిమా తేజ్ ఐ ల యూ. సినిమా ఫ‌స్ట్ లుక్‌ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు.సినిమా టీజ‌ర్‌ని ఈ రోజు(మంగ‌ళ‌వారం) ఉద‌యం విడుద‌ల చేశారు.ఓ అందమైన అమ్మాయి గిటార్ పట్టుకుని వినసొంపైన సంగీతాన్ని వాయిస్తోంది. ఆమె అందాన్ని వినసొంపైన సంగీతాన్ని తదేకంగా చూస్తూ తన్మయంతో కళ్లు మూసకునే లోపు ఆ అమ్మాయే వచ్చి తన కౌగిటిలో ఒదిగిపోతే ఇంతకంటే రొమాంటిక్ మూడ్ ఇంకేముంటుంది. ఈ విధాంగా టీజ‌ర్ డిజైన్ చేశాడు.టీజ‌ర్‌ని చూస్తుంటే అర్థం అవుతుంది ఇది ప‌క్కా ల‌వ్ స్టోరి అని.

ప్రేమ‌క‌థ‌ల స్పెష‌లిస్ట్ క‌రుణాక‌రున్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.అనుపమా పరమేశ్వరన్‌ ఈ చిత్రంలో తేజూకు జోడీగా నటిస్తోంది. గోపీసుందర్‌ సంగీతం అందిస్తుండగా.. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై కేఎస్‌ రామారావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌రుస ప్లాప్‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న సాయి ధ‌రమ్ తేజ్‌కు ఈ సినిమా అయిన హిట్ ఇస్తుందేమో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -