Friday, March 29, 2024
- Advertisement -

అవకాశాల్లేక విలన్ గా మారిన సంగీత దర్శకుడు

- Advertisement -

కుంచె రఘు.. తెలుగు సినిమా పరిశ్రమ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు, సంగీత దర్శకుడు. ఎప్పుడో ఇండస్ట్రీ కి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి వివిధ రకాలుగా తన నైపుణ్యానికి సాన పెట్టుకున్న వ్యక్తి రఘు కుంచె. అయితే ఒకప్పుడు వరుస సినిమా ల తో బిజీ గా ఉన్న రఘు కుంచె ఇప్పుడు మాత్రం జోరు తగ్గించాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకో ఏమో గానీ ఈయన సంగీతానికి ఇప్పుడు శ్రోతలు కరువయ్యారు. అవకాశాలు కూడా అంతంత మాత్రం గానే ఉండటం తో ఇప్పుడు రఘు కుంచె విలన్ గా మారి తన లక్ ని టెస్ట్ చేసుకోనున్నారు.

అయితే త్వరలో తెలుగు లో రానున్న ‘‘పలాస 1978’’ మూవీలో రఘు కుంచె విలన్ గా కనిపించబోతున్నారు. ఒక రెగ్యులర్ విలన్ లాగా కాకుండా నాలుగు డిఫరెంట్ షేడ్స్ ఉన్న విలన్ పాత్ర ని ఆయన ఎంచుకున్నారు. ఈ సినిమా కి రఘు సంగీతం కూడా సమకూరుస్తుండటం విశేషం.

ఈ సినిమా కి డైరెక్టర్ కరుణ కుమార్. రియలిస్టిక్ క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ‘‘పలాస 1978’’ లో రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -