Thursday, May 2, 2024
- Advertisement -

అనంత టీడీపీలో క‌ల‌క‌లం… బాల‌య్య‌ను రంగంలోకి దింపిన చంద్ర‌బాబు…

- Advertisement -

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబ‌కు వైఎస్ జ‌గ‌న్ భ‌యంకంటె భాజాపా భ‌యం ప‌ట్టుకుంది. రాష్ట్రంలో ఆప‌రేష‌న్ క‌మ‌లం మొద‌లు పెట్టింది భాజాపా. వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించ‌న‌ని ఇత‌ర పార్టీల నేత‌ల‌ను పార్టీలోకి తీసుకోమ‌ని ఇప్ప‌టికే బాబుకు జ‌గ‌న్ అభ‌యం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇదే అదునుగా భావించిన భాజాపా మాత్రం వ‌ల‌స‌ల‌పై దృష్టి సారించింది. వైసీపీలోకి వెల్లాలంటె ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి రావాల‌ని జ‌గ‌న్ కండీష‌న్ పెట్టారు. ఇక మిగిలింది భాజాపా మాత్ర‌మే. వది కూడా త‌మ‌పై వ‌చ్చిన అవినీతి నుంచి త‌ప్పించుకోవ‌డానికి మాత్ర‌మే స‌ద‌రు నేత‌లు భాజాపాలో చేరుతున్నార‌నె విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తాజాగా బాజాపా దెబ్బ‌కు అనంత‌పురం టీడీపీ ఖాలీ అయ్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే వ‌ర‌దాపురం మాజీ ఎమ్మెల్యే సూరి కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ప్ర‌ధానంగా ప‌రిటాల‌, జేసీ ష్యామిలీ ఇత‌ర నేత‌లంద‌రూ కాషాయం పార్టీతో ట‌చ్‌లో ఉన్నారు. ఇలానె వ‌దిలిస్తే పార్టీ మొత్తం కాలీ అవుతంద‌ని భావించిన బాబు బాల‌య్య‌ను రంగంలోకి దింపారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంతో నేత‌ల‌తో పాటు పార్టీ క్యాడ‌ర్ కూడా దూరం అయ్యింది. దీంతో పార్టీని వీడిన నేతల నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెక్ పెట్టాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది టీడీపీ.

ధర్మవరంలో మరోసారి విజయం సాధించాలంటే… ఇప్పటి నుంచే అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రొత్సహించాలని భావిస్తున్న చంద్రబాబు… ఈ బాధ్యతలను హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, తన వియ్యంకుడు బాలకృష్ణకు అప్పగించారని తెలుస్తోంది. త్వరలో చంద్రబాబు జిల్లా పర్యటనకు రానుండటంతో ధర్మవరానికి కొత్త జిల్లా కార్యదర్శిని ఎన్నుకోవాలని అధిష్టానవర్గం భావిస్తోంది.

ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క వ‌ర్గంపై ప‌ట్టున్న‌పరిటాల సునీత కుటుంబానికే ధర్మవరం బాధ్యతలు అప్పగించాలని కొందరు నేతలు అభిప్రాయపడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల సునీత తనతో పాటు తన కుమారుడు శ్రీరామ్‌కు కూడా టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అధినాయ‌క‌త్వం నో చెప్ప‌డంతో త‌న నియోజ‌క వ‌ర్గాన్ని కొడుకు కోసం త్యాగం చేశారు సునీత‌. అయినా శ్రీరామ్ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయారు.

ఈ నేప‌థ్యంలో వచ్చే ఎన్నికల్లో పరిటాల కుటుంబం నుంచి ఇద్దరికి పోటీ చేసే అవకాశం కల్పించాలని భావిస్తున్న టీడీపీ… ధర్మవరం టీడీపీ సారథ్య బాధ్యతలను ఆ కుటుంబానికి అప్పగించడం మేలు అని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ధర్మవరానికి కొత్త జిల్లా కార్యదర్శిని ఎన్నుకోనె బాధ్య‌త‌ను హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణపై పెట్టారు బాబు. బాబు ఆదేశాలతో బాలయ్య ధర్మవరాన్ని లీడ్ చేయగల నేతని వెతికే పనిలో పడ్డారు బాలయ్య. జిల్లా పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించిన బాల‌య్య పరిటాల శ్రీరాం అయితే యువకుడు కాబట్టి బాగా పనిచేయగలడని, పైగా ధర్మవరం, రాప్తాడు, పెనుగొండ ప్రాంతాల్లో పరిటాల కుటుంబానికున్న ఆదరణ కూడా బాగా కలిసి వస్తుందని బాలయ్య అభిప్రాయపడుతున్నారు. బాబు ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌రిటాల ఫ్యామిలీ భాజాపా వైపు వెల్ల‌కుండా ఉంటుంద‌ని పార్టీ అధినాయ‌క‌త్వం భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -