తాత, తండ్రి వారసత్వంతో అక్కినేని నాగచైతన్య సినీ ఇండస్ట్రీకి పరిచయమై ఆ తరువాత తాను సొంతంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తండ్రిపై ఆధారపడకుండా భిన్నమైన సినిమాలు చేస్తూ విజయవంతమైన హీరోగా చైతూ గుర్తింపు పొందాడు. తన సహ నటి హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత చేస్తున్న సినిమా చిత్రం ‘సవ్యసాచి’. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన విషయాన్ని చైతై ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఫుల్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తవుతున్నాయి. తాజాగా సవ్యసాచికి సరైన అర్థాన్ని చెబుతూ చైతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశాడు. ‘సవ్యసాచి’ అంటే.. రెండు చేతులు అని.. సమర్థంగా, శక్తివంతంగా వాడే వాళ్లు అని సవ్యసాచులు అని వివరించారు.
అర్జునుడి ఐదో పేరు కూడా సవ్యసాచినే. ఎందుకంటే..తన రెండు చేతులతో ఒకే వేగంలో విలు విద్యని అలవోకగా ప్రదర్శించగలడు.. అందుకనే సవ్యసాచి పేరు వచ్చింది. ఈ సినిమాలో హీరో కూడా తన రెండు చేతులతో తనకు ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడనే నేపథ్యంలో ఈ సినిమా ఉంది.
ఈ సినిమాలో తమిళ నటుడు మాధవన్, నిధి అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమా మే 24వ తేదీన విడుదల చేయనున్నారు.