Wednesday, May 15, 2024
- Advertisement -

100% ల‌వ్ జోడీ సంద‌డి

- Advertisement -

గుంటూరులో 100% ల‌వ్ జోడీ సంద‌డి చేసింది. సినిమా విడుద‌లైన త‌ర్వాత కూడా ఈ జోడీ ప‌లు సినిమాల్లో న‌టించింది. మ‌ళ్లీ కొన్నాళ్ల త‌ర్వాత ఓ షాపింగ్ మాల్ ప్రారంభానికి హాజ‌రై సంద‌డి చేశారు. గుంటూరులో ఏర్పాటుచేసిన ఓ షాపింగ్ మాల్‌ను శ‌నివారం ప్రారంభించారు. వారిద్ద‌రే అక్కినేని నాగ‌చైత‌న్య‌, మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా. వీరిద్ద‌రూ క‌లిసి ప‌లు సినిమాలు చేశారు. అయితే అంద‌రికీ హండ్రెట్ ప‌ర్సంట్ ల‌వ్ సినిమానే గుర్తొస్త‌ది. ఆ త‌ర్వాత సునీల్‌తో క‌లిసి చేసిన త‌డాఖాలో కూడా వీరిద్ద‌రి తడాఖా చూపించారు.

గుంటూరులో షాపింగ్‌మాల్ ప్రారంభించిన అనంత‌రం అభిమానుల‌తో మాట్లాడారు. వీరిద్ద‌రినీ చూడ‌డానికి జ‌నాలు బారులు తీరారు. ప్ర‌స్తుతం చైతూ, త‌మ‌న్నావేర్వేరు సినిమాల్లో బిజీగా ఉన్నారు. స‌వ్య‌సాచి, శైల‌జా రెడ్డి అల్లుడు సినిమాల్లో న‌టిస్తున్నాడు. త‌మ‌న్నా బ‌హుబ‌లి త‌ర్వాత కొన్ని సినిమాల్లో న‌టించింది. మ‌రికొన్ని షూటింగ్‌కు రావాల్సి ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -