Thursday, May 9, 2024
- Advertisement -

జోష్ మీదున్న యువ న‌టుడు .. వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీ

- Advertisement -

జోష్‌గా సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి ఏమాయే చేశావెతో అభిమానుల‌ను మాయ చేసి 100 ప‌ర్సెంట్ ల‌వ్‌తో హండ్రెడ్ ప‌ర్సెంట్ న‌ట‌న‌తో ఇత‌ర న‌టీన‌టుల‌కు ద‌డ పెట్టేసి బెజ‌వాడతో న‌టించి త‌డాఖా చూపించి మ‌నంతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు నాగ‌చైత‌న్య‌. అక్కినేని వంశంలో మూడో త‌రం న‌టుడు చైతు. తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర్‌రావు ఆశీస్సులు, నాన్న అక్కినేని నాగార్జున దీవెన‌ల‌తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో దూసుకెళ్తున్నాడు. 31వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న చైతు 15 సినిమాలు పూర్తిచేసి 16వ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించ‌బోతున్నాడు. పెళ్లి త‌ర్వాత జ‌రుపుకుంటున్న తొలి పుట్టిన‌రోజు ఇది. ఇది త‌న‌కు ప్ర‌త్యేకం.

జోష్‌తో న‌ట‌న‌లో అక్ష‌రాలు నేర్చుకున్న చైతు ఇప్పుడు స‌వ్య‌సాచితో ప‌రిపూర్ణ అక్ష‌రాస్యుడిగా న‌ట‌న‌లో రాణిస్తున్నాడు. అక్కినేని వంశంలో న‌ట‌కు కొద‌వ లేద‌ని చైతు నిరూపిస్తున్నాడు. త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు. అయితే కొన్ని సినిమాలు ఆశించిన ఫ‌లితం రాకున్నా నిరాశ చెంద‌కుండా ముందుకు వెళ్తున్నాడు. జ‌య‌ప‌జ‌యాలు సాధార‌ణ‌మ‌ని చెబుతూ వెళ్తున్నాడు. అతడు న‌టించిన తొలి సినిమా జోష్ కూడా అంత‌గా ఆడ‌లేదు. కానీ ఏమాయే చేశావె సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇక 100 ప‌ర్సెంట్ ల‌వ్ సినిమా అయితే బ్లాక్ బ‌స్ట‌ర్‌. ద‌డ‌, బెజ‌వాడ‌, త‌డాఖా వ‌రుస ప‌రాజ‌యాలు పొందాయి. ఆ త‌ర్వాత అక్కినేని కుటుంబం అంతా న‌టించిన సినిమా మ‌నం మంచి హిట్‌గా నిలిచింది. తాతయ్య అక్కినేని నాగేశ్వ‌ర్‌రావు, తండ్రి నాగార్జున‌, త‌మ్ముడు అఖిల్‌తో క‌లిసి న‌టించిన మ‌నం సినిమాలో న‌టించాడు. ఆటోన‌గ‌ర్ సూర్య‌, దోచేయ్‌, సాహ‌సం శ్వాస‌గా సాగిపో ప‌ర్వాలేద‌నిపించాయి. 2014లో ప్రారంభించిన దుర్గ సినిమా ఎందుకో విడుద‌ల కాలేదు. ప్రేమ‌మ్‌, రారండోయ్ వేడుక చూద్దాం మంచిగానే ఆడింది. త‌ర్వాత వ‌చ్చిన యుద్ధం శ‌ర‌ణం గ‌చ్ఛామి ప‌రాజ‌యం పొందింది. అయినా బాధ‌ప‌డ‌కుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. నాగ‌చైత‌న్య న‌టించిన సినిమాలు. ఇక వివాహానంత‌రం స‌మంత, చైతు జంట సినీ ప‌రిశ్ర‌మ‌కు త‌మ సేవ‌లు అందిస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా అత‌డికి ఆద్య మీడియా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతోంది.

జోష్‌
ఏమాయే చేశావె
100 ప‌ర్సెంట్ ల‌వ్‌
ద‌డ‌
బెజ‌వాడ‌
త‌డాఖా
దోచేయ్‌
ఆటోన‌గ‌ర్ సూర్య‌
మ‌నం
ఒక లైలా కోసం
సాహ‌సం శ్వాస‌గా సాగిపో
ప్రేమ‌మ్‌
రారండోయ్ వేడుక చూద్దాం
యుద్ధం శ‌ర‌ణం గ‌చ్ఛామి
దుర్గ (మ‌ధ్య‌లోనే ఆగింది)
స‌వ్య‌సాచి (ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది)
సైలాజా రెడ్డి అల్లుడు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -