Monday, May 20, 2024
- Advertisement -

బీసీసీఐపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన విరాట్ కోహ్లీ..

- Advertisement -

బీసీసీఐ ఒక ప్లానింగ్ లేకుండా వ‌రుస‌గా సిరీస్‌లు నిర్వ‌హిస్తుండ‌టంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆట‌గాల్ల‌కు విశ్రాంతి ఇవ్వ‌కుండా ఇలా వ‌రుస‌గా సిరీస్‌లు నిర్వ‌హిస్తె ఆట‌గాల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న‌ శ్రీలంక-భార‌త్‌ సిరీస్ ముగిసిన వెంటనే ద‌క్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది.

వరుస సిరీస్‌లు నిర్వహించేటప్పడు ఆటగాళ్ల కోణంలో సైతం ఆలోచించాలని బీసీసీఐకి హితవు పలికారు. గత్యంతరం లేకనే వరుస సిరీస్‌లు ఆడాల్సి వస్తుందని బీసీసీఐకి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక సిరీస్ త‌ర్వాత గ్యాప్ లేకుండా సౌతాఫ్రికాకు వెళ్తున్నామ‌ని, ఇలా రెస్ట్ లేకుండా ఆడ‌టం .. ఇండియా క్రికెట్ కు మంచిది కాద‌ని అన్నాడు. . ఇక రేప‌టి నుంచి భార‌త్ , శ్రీలంక మ‌ధ్య నాగ్ పూర్ లో సెకండ్ టెస్ట్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే.

మాకు ఒక నెల గడువు దొరికినట్టయితే.. మేం సరిగ్గా ఈ పర్యటనకు సన్నద్ధమై ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు మాకు ఇచ్చిన సమయంలోనే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని కోహ్లి అసహనం వ్యక్తం చేశారు.

‘మేం సమయం కోసం అల్లాడిల్సిన పరిస్థితి నెలకొంద‌న్నారు. సహజంగా విదేశీ పర్యటనలు అంటే జట్టు తగినంతగా సన్నద్ధం కావడానికి సమయం ఇస్తారు. కానీ ఇప్పుడు మాకు ప్రిపరేషన్‌ కోసం ఎన్ని రోజులు ఉన్నాయో తెలియని పరిస్థితి’ అని కోహ్లి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -