Friday, May 9, 2025
- Advertisement -

మహేశ్ బాబునే నమ్ముకొన్న నాగ చైతన్య..!

- Advertisement -

తండ్రి వారసత్వం ఉన్నా.. నాగ చైతన్య మాత్రం మహేశ్ బాబు సెంటిమెంటునే నమ్ముకొన్నట్టుగా ఉన్నాడు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో మహేశ్ బాబునే మరో సారి స్మరిస్తున్నాడు.

మహేశ్ సినిమాలోని పాటను టైటిల్ గా పెట్టుకొన్నప్పుడు హిట్ దక్కడంతో ఇప్పుడు మరోసారి అదే రీతినే ముందుకు పోతున్నాడు చైతూ. ఇంతకీ విషయం ఏమిటంటే…ఇంతకు ముందు ‘ఏం మాయ చేశావే’ అంటూ వచ్చిన చైతూ ఇప్పుడు “సాహసం శ్వాసగా సాగిపో ‘ అంటూ వస్తున్నాడు.

ఈ రెండు టైటిల్స్ మధ్య ఒక సామీప్యత ఉంది. అదేమిటంటే ఈ రెండూ మహేశ్ బాబు సినిమా ఒక్కడు సినిమాలోని పాట చరణాల నుంచి స్పూర్తి పొంది తయారు చేసుకొన్నవే. “నువ్వేం మాయ చేశావో కానీ..” అనే పాట స్ఫూర్తితో ఇంతకు ముందు చైతన్య “ఏం మాయ చేశావే” అంటూ టైటిల్ పెట్టుకొన్నాడు. ఇప్పుడు అదే సినిమాలో “సాహసం శ్వాసగా సాగిపో” అనే టైటిల్ ను పెట్టుకొన్నాడు ఈ హీరో.

గౌతమ్ మీనన్ దర్శకత్వంల చైతూ హీరోగా రూపొందుతున్న సినిమా టైటిల్ ను ఈ విధంగా ఫిక్స్ చేశారట. మరి దీన్నిబట్టి ఈ దర్శకుడు, హీరోలు మహేశ్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని చెప్పవచ్చు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా ఒక రొమాంటిక్ థ్రిల్లర్ అని సమాచారం. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఆడియోను విడుదల చేయనున్నారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -