Friday, May 17, 2024
- Advertisement -

రామ్ చేయాలనుకొన్న సినిమాను తన్నుకుపోయిన నాగచైతన్య!

- Advertisement -
మలయాళ సినిమా ‘ప్రేమమ్’ ను రీమేక్ చేయడానికి చాలా ఆత్రుతను కనబరిచాడు హీరో రామ్. రీమేక్ సినిమాల పట్ల చాలా ఆసక్తిని హీరోల్లో ఒకరైన రామ్ ఇది వరకూ “బోల్ బచ్చన్” ను రీమేక్ చేశాడు. ఇప్పుడు ఈ మలయాళ సినిమాను కూడా రీమేక్ చేయాలని అతడు అనుకొన్నాడు. అయితే ఇప్పుడు ఈ అవకాశాన్ని తన్నుకుపోయాడు నాగచైతన్య. ఇతడు హీరోగా ఆ సినిమా తెలుగులో రూపొందడం ఖాయం అయినట్టుగా తెలుస్తోంది.
 
చందూమొండేటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్నట్టుగా సమాచారం. మరి చైతూ ఇప్పుడు సరైన హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకొన్న ‘దోచెయ్’ చైతూను నిరాశ పరించింది. ‘స్వామిరారా’ వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు కూడా నాగార్జున తనయుడికి హిట్ ను ఇవ్వలేకపోయాడు. మరి ఇప్పుడు చైతూ గౌతమ్ మీనన్ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకొని ఉన్నాడు.
 
ఆ సినిమా పూర్తి అయిన వెంటనే ఇతడు ఈ రీమేక్ సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. మరి ఈ రీమేక్ సినిమాతోనైనా చైతూకు సరైన హిట్ దొరుకుతుందని ఆశిద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -