Saturday, April 27, 2024
- Advertisement -

వెబ్ సిరీస్ దర్శకుడితో నాగ చైతన్య సినిమా..?

- Advertisement -

నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన అక్కినేని హీరో నాగ చైతన్య తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.. రెండో సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టి టాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పాడు.. ఆ వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిన నాగ చైతన్య కి ఏ సినిమా కూడా తన కెరీర్ పెద్దగా ఉపయోగపడలేదు.. ఒకానొక సమయంలో ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడని చైతు పై విమర్శలు కూడా వచ్చాయి.. అయితే 100% లవ్, మనం, ప్రేమం లాంటి సినిమాలు కెరీర్ లో సూపర్ హిట్ అయిన కూడా అవి వేరే వారి ఖాతాలోకి వెళ్ళిపోయాయి..

ప్రస్తుతం లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్న చైతు తాజాగా మరో సినిమా ని కూడా ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.. వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమా తో మంచి హిట్ కొట్టిన వెంకి అట్లూరి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చైతుకి చెప్పిన ఓ పాయింట్ బాగా నచ్చిందంట. దాంతో డెవలప్ చేశాక మాట్లాడుకుందామని అనుకున్నట్టు సమాచారం. వెంకీ గతంలో అఖిల్ తో మిస్టర్ మజ్ను రూపంలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ఇప్పుడు అన్నయ్యతో హిట్టు కొట్టే స్కెచ్ ఏదో వేసినట్టు కనిపిస్తోంది. ఈ సినిమా తో పాటు చైతు లాక్ డౌన్ టైంలో విడుదలైన వెబ్ సిరీస్ లూజర్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట.

ఇప్పటికే కొన్ని డిస్కషన్లు జరిగాయని త్వరలో ప్రకటన వచ్చే అవకాశాలు లేకపోదని సమాచారం. క్రీడా నేపధ్యంలో ఎమోషన్స్ ని అద్భుతంగా చూపిస్తూ అభిలాష్ లూజర్ ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. దాని తర్వాత ఇంకొన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ చైతుకి సరిపోయే సబ్జెక్టు సిద్ధంగా ఉండటంతో చైతన్య దీని వైపే మొగ్గు చూపినట్టు వినికిడి. ఇక ప్రస్తుతం సినిమా ల విషయానికొస్తే చైతు గత సినిమా శైలజా రెడ్డి అల్లుడు అనుకున్నంత ఆడలేదు..మజిలీ పర్వాలేదనిపించుకుంది.. దాంతో ఇప్పుడు చేస్తున లవ్ స్టొరీ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు చైతు.. ఇక ఈ సినిమా చివరిదశలో ఉండగా చైతు తన తదుపరి సినిమా ని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యు అనే సినిమా చేయబోతున్నాడు.. మనం లాంటి వెరైటీ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -