Sunday, May 5, 2024
- Advertisement -

చంద్రబాబు ను టార్గెట్ చేస్తున్న టీడీపీ నేతలు..?

- Advertisement -

రాష్ట్రంలో ఏ ప్రాంతం పరిస్థితి ఎలా ఉన్నా విశాఖ పరిస్థితి, అమరావతి పరిస్థితి కొంత అయోమయంగా ఉన్నట్లు కనిపిస్తుంది.. ఒక చోట రాజధాని పోతుండడం, ఇంకోచోట రాజధాని రాబోతుండడం తో రెండు ప్రాంతాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీక మినుకు మినుకు మంటూ బ్రతుకుతున్నారు.. వస్తుంది అని చెప్పి రాజధాని లేకపోతే ఎలా అని విశాఖ, ఉన్నదాన్ని తీసుకుపోతే ఎలా అని అమరావతి ప్రజలు నానా హైరానా పడుతున్నారు.. ప్రతిపక్షం టీడీపీ అయితే ఈ విషయంలో ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు.. పార్టీ కి రెండు కళ్లలాంటి రెండు ప్రాంతాలలో దేనిని వ్యతిరేకించాలి అర్థంకాని పరిస్థితుల్లో అమరావతి కి సపోర్ట్ చేస్తూ వచ్చారు..

అయితే అమరావతి కి సపోర్ట్ చేస్తున్నారు కదా అని విశాఖ ప్రజలేం ఊరుకోలేదు.. దశాబ్దాల నుంచి పార్టీ గెలుపుకు కారణమైన ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోబోతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని స్థానిక టీడీపీ లీడర్లను నిలదీస్తున్నారు.. అందరు బాగానే ఉన్నా ఈ ఇష్యూ లో టీడీపీ విశాఖ లీడర్లు బాగా నలిగిపోతున్నారు.. ఓవైపు గెలిపించిన ప్రజల మాట వినాలా, సీటిచ్చినా పార్టీ మాట వినాలా అర్థం కానీ పరిస్థితులలో ఉంటూ సైలెంట్ గా ఉంటున్నారు..   అప్పటికీ ప్రజల వత్తిడి, చంద్రబాబు పై అసహనం తట్టుకోలేక కొందమంది నాయకులూ వైసీపీ బాట పట్టారు కూడా.

గెలిచినా నలుగురిలో ఇద్దరు అప్పటికే వైసీపీ సరసన చేరిపోయారు.. అయితే చేరిపోతే పర్వాలేదు కానీ చంద్రబాబు ను దారుణంగా విమర్శించి మరీ వైసీపీ లో చేరి టీడీపీ లో తమకు ఏర్పడ్డ మచ్చను అక్కడే తుడిచేసుకుని వచ్చేస్తున్నారు.. నిన్నటి టీడీపీ తమ్ముడు, ఈ రోజు రెబెల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బాబు గురించి చెబుతున్న కొత్త ముచ్చట్లు చూస్తుంటే తమ్ముళ్లలో ఇంతలోనే ఇంత మార్పా అని ఆశ్చర్య పోతున్నారు..  తెలుగుదేశం పార్టీకి పదవుల ఆశలు తప్ప అసలు రాజకీయం తప్ప విధానం అంటూ ఒకటి లేనేలేదని కూడా వాసుపల్లి గణేష్ హాట్ కామెంట్స్ చేశారు. పదమూడేళ్ళ పాటు పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన తననే హింసించిన పసుపు పార్టీ పెద్దలకు పరాభవం తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ కామెంట్స్ కి ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -