టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చకున్న నాగ చైతన్య, సమంత పెళ్ళి తర్వాత వ నిర్వాణ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో చైతూ-సామ్‌లు భార్య భర్తలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లను విడుదల చేశారు. ట్విట్టర్ లో నాగ చైతన్య మజిలీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు.
‘ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. చై, సామ్ జంటగా నటిస్తున్న నాలుగో చిత్రమిది. కొత్త ఏడాదిని ఈ చిత్రంలో ఆరంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఆడ్వాన్స్ న్యూఇయర్ శుభాకాంక్షలు. శివ నిర్వాణతో కలిసి పనిచేయడం నా కల. ఏప్రిల్‌లో కలుస్తాం’ అని చైతూ పేర్కొంటూ లుక్‌ను షేర్ చేశారు.
సినిమా విశాఖపట్నం బ్యాక్ గ్రౌండ్ లో సినిమా కథ నడవనుంది. రొమాంటిక్ అండ్ ఎమోషనల్ గా చైతు సమంత జోడి తెగ ఆకర్షిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్తేరు గ్రౌండ్స్, విశాఖపట్నం అని రాసుంది. ఈ సినిమాలో చైతన్య మాజీ క్రికెటర్ గా, సమంత రైల్వే క్లర్క్ గా కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. హరీష్ పెద్ది, సాహు గరపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాను 2019 వేసవి కానుకగా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
