- Advertisement -
అక్కినేని నాగచైతన్య ఇటీవలే శైలజా రెడ్డి అల్లుడితో హిట్ కొట్టాడు.ఇక తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు నాగచైతన్య.చందు మొండేటి దర్శకత్వం నటిస్తున్న సవ్యసాచి వచ్చే నెల 2న విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
పూర్తిగా సంస్కృత పదాలతో సాగిన ఈ పాటకు కీరవాణి స్వరాలు అందించగా ఆయన తండ్రి శివశక్తి దత్తా, రామకృష్ణ కోడూరితో కలిసి సాహిత్యమందించారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా సీనియర్ నటుడు మాధవన్, భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.