Monday, May 13, 2024
- Advertisement -

చైతన్య బరువు ఎవరి కోసం తగ్గాడు ?

- Advertisement -

అక్కినేని యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం ప్రేమం సినిమా రీమేక్ లో బిజీ గా ఉన్నాడు. మలయాళం సూపర్ హిట్ ప్రేమం అక్కడ పోయిన సంవత్సరం అతిపెద్ద హిట్ కొత్తగా దానికి తెలుగు రీమేక్ గా నాగ చైతన్య చందూ అనే డైరెక్టర్ తో తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా తెరకి ఎక్కిస్తున్నారు.

ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే లవ్ స్టోరీ అంటే నాగ చైతన్య అనే పరిస్థతి అయిపొయింది అందరికీ ఈ సినిమా కోసం నాగ చైతన్య బాగా వెయిట్ కూడా తగ్గి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. 

మొన్నటి వరకూ వైజాగ్ లో జరిగిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మళ్ళీ కొంత గ్యాప్ తరవాత చైతన్య టీనేజ్ సీన్ లు షూటింగ్ చేసే పనిలో పడ్డారు. ఈ క్యారెక్టర్ కోసమే చైతూ చాలా సన్నగా కనిపించ బోతున్నాడు. ఇప్పటికే చైతన్య సాహసం శ్వాసగా సాగిపో కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ప్రేమమ్ సినిమాను కూడా సమ్మర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి ప్రేమమ్ కోసం ఇంత కష్టపడుతున్న చైతు అదే రేంజ్ హిట్ కొడతాడో లేదో చూడాలి.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -