Sunday, May 19, 2024
- Advertisement -

ట్రెండ్ ను పవన్ ఫాలో అవ్వడు. ట్రెండ్ ను సెట్ చేస్తాడు

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ సమర్పణలో కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరిగింది.

బిగ్ సీడీని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఆడియో సీడీలను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. తొలిసీడీని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ”చాలాకాలం తర్వాత తమ్ముడు పవన్ కార్యక్రమంలో నేను పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ మధ్య సంవత్సరాలలో నేను ఎక్కువగా, రిపీటెడ్ గా చూసిన సినిమాయే ఏదైనా ఉందంటే గబ్బర్ సింగ్.

గతంలో నేను కల్యాణ్ సినిమాలు చూశాను కానీ వేరే వ్యాపకం పెట్టుకుని చూసిన సినిమా గబ్బర్ సింగ్ కే జరిగింది. పవన్ కల్యాణ్ మాస్ ఎంటర్ టైనర్ ఆ చిత్రంలో అలరించాడు. ఇలా కదా పవన్ సినిమా ఉండాల్సింది. ఈరకంగా కదా అభిమానులు ఆయన అలరించాల్సింది కదా అని ముచ్చటపడి ఆ సినిమాలో ప్రతి సీన్ ను ఎంజాయ్ చేస్తూ చూస్తాను.

దబాంగ్ ట్రీట్ మెంట్ వేరు. కల్యాణ్ తనదైన స్టయిల్ లో మార్చుకుని చేసిన చిత్రం. ట్రెండ్ ను పవన్ ఫాలో అవ్వడు.ట్రెండ్ ను సెట్ చేస్తాడని గబ్బర్ సింగ్ తో ప్రూవ్ అయ్యింది. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం మరో ట్రెండ్ ను క్రియేట్ చేసింది.

ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పవన్ కల్యాణ్ మనసుకు దగ్గరైన సినిమా. కథ, స్క్రీన్ ప్లే తనది. డైరెక్టర్ బాబీ తన దర్శక ప్రతిభతో పవన్ కథను, కథాంశాన్ని తనదైన స్టయిల్ లో పవన్ ఇన్ పుట్స్ ను తీసుకుని అత్యద్భుతంగా తీశాడ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, డైరెక్టర్స్ బాబీ, దేవిశ్రీప్రసాద్, ఎన్.టి.వి.అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి, నిర్మాతలు జెమిని కిరణ్, ఎ.ఎం.రత్నం, కబీర్ సింగ్, సాయిమాధవ్ బుర్రా, అనంత్ శ్రీరాం, సినిమాటోగ్రాఫర్ అర్థర్ విల్సన్, అండ్రూ, ఎడిటర్ గౌతంరాజు, రామజోగయ్య, అనంత్ శ్రీరాం, రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -