Saturday, May 18, 2024
- Advertisement -

చ‌లో టీజ‌ర్ విడుద‌ల‌.. ఆక‌ట్టుకుంటున్న నాగ‌శౌర్య‌

- Advertisement -

రేయ్ మ‌రీ సాంబార్ ఇడ్లీ కోసం ఇలా సంపేసుకుంటే అస‌హ్యాంగా ఉంటాది క‌దా అని నాగ‌శౌర్య విల‌న్ల‌కు స‌ల‌హాలు ఇస్తున్నాడు. నాగ‌శౌర్య న‌టిస్తున్న చ‌లో సినిమా టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌ల అయ్యింది. సినిమాలో మంచి లుక్‌తో క‌నిపిస్తున్నాడు. గ‌త చిత్రాల‌కు భిన్నంగా బాడీ ఉంది. త‌న స‌హ‌జ న‌ట‌న‌తో అల‌రిస్తున్నాడు.

ఈ సినిమా ఆంధ్ర‌, త‌మిళ రాష్ర్టాల‌కు స‌రిహ‌ద్దు ఉన్న గ్రామం గురించి సినిమా ఉండ‌నుంది. ‘‘తిరుప్పురం. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లో ఉన్న ఓ గ్రామం. 1953లో తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు ఆ విభజన రేఖ ఊరి మధ్య నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒకవైపు తమిళవాళ్లు. మరోవైపు తెలుగువాళ్లు. అటువాళ్లు ఇటు రాకూడదు. ఇటువాళ్లు అటు పోకూడదు.

కంచె వేసుకుని కట్టుబాట్లు పెట్టుకుని మరీ కొట్టుకు చస్తున్నారు.’’ అనే వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా టీజ‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. సన్నివేశాలు వాయిస్ ఓవర్‌కి అనుగుణంగా పరుగులు తీశాయి. ‘‘అరె నేనూ గొడవలను ఎంకరేజ్ చేస్తానురా.. మరీ ఇలా సాంబారు, ఇడ్లీ కోసం చంపేసుకుంటే అసహ్యంగా ఉంటది’’ అనే డైలాగ్‌తో నాగశౌర్య కామెడీ చేయడమే కాకుండా ఫైట్స్ కూడా చేశాడు. మాస్ లుక్‌లో, లవర్‌ బోయ్‌గా నాగ శౌర్య కనిపిస్తున్నాడు. హీరోయిన్‌గా రష్మికా మందన్నా న‌టిస్తోంది. క్యూట్ లుక్స్‌తో అలరించేలా క‌నిపిస్తోంది. మణిశర్మ తనయుడు మహతి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=88_i6E51r5I

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -