Monday, May 13, 2024
- Advertisement -

నాగ‌శౌర్య ‘అమ్మమ్మగారిల్లు’… టీజ‌ర్‌

- Advertisement -

హీరో నాగశౌర్య మంచి జోష్‌లో ఉన్నాడు. ‘ఛలో’  ఇచ్చిన స‌క్సెస్‌తో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.నాగ‌శౌర్య కొత్త సినిమా అమ్మమ్మగారిల్లుతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ఈ సినిమా పల్లెటూరుకి సంబంధించిన క‌థ‌లా ఉంది. హీరో వాళ్ల అమ్మమ్మ ఇంటికి సెల‌వ‌ల‌కి వెళ్తాడు. అక్క‌డ జ‌రిగే పల్లెటూరి వాతావరణం,సరాద సన్నీవేశాలు. అక్క‌డ ప్రేమ క‌థ‌,ప‌ల్లెటూరు గొడ‌వ‌లు ఇలా సినిమా ఉంటుంద‌ని ఈ టీజ‌ర్‌ని చూస్తుంటే అని అర్థం అవుతుంది.

సినిమాలో హీరోయిన్‌గా శామిలి చేస్తుంది.అప్పుడెప్పుడో సిద్దార్థ్ ఓయ్ సినిమాలో బొద్దుగా క‌నిపించిన శామిలి ఈ సినిమాలో చాలా క్యూట్ గా కనిపించింది.రావు రమేష్ మరోసారి తన బాడీ లాంగ్వేజ్ త‌గ్గ పాత్ర‌తో క‌నిపిస్తున్నాడు.ఈ సినిమా మొత్తం అమ్మ‌మ్మ చుట్టు తిరుగుతుంద‌ని స‌మాచారం. ఈ టీజ‌ర్‌ని చూస్తుంటే నాగ‌శౌర్యకి మ‌రో హిట్ వ‌చ్చేలా ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -