Monday, May 13, 2024
- Advertisement -

ఈనెల 30 వైసీపీ, టీడీపీ పోటాపోటీ దీక్ష‌క‌లు…

- Advertisement -

ఈనెల 30 న రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్ర‌త్యేక‌హోదాను తుంగ‌లోకి తొక్కిన టీడీపీ ఇప్పుడు ఆ క్రెడిట్ కోసం నానా తంటాలు ప‌డుతోంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ బాబులో అల‌జ‌డి మొద‌ల‌య్యింది. ప్ర‌త్యేక‌హోదా క్రెడిట్ ఎక్క‌డ వైసీపీకీ ద‌క్కుతుందోన‌ని బాబు కుయ‌క్తులు ప‌న్నుతున్నార‌.

ప్ర‌త్యేక‌హోదా పాపాన్ని అంతా కేంద్రంలోని భాజపా సర్కార్ చేసింది అంటూ ఆయన తనదైన శైలిలో భారీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన 2014లో ప్రత్యేకహోదా ఇస్తాం అంటూ నరేంద్రమోడీ హామీ ఇచ్చిన రోజునే ఏప్రిల్ 30న వంచన దినోత్సవం నిర్వహించడానికి అదే తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 30న తిరుపతిలో తలపెట్టిన నిరసన దినానికి వ్యతిరేకంగా వైసీపీ భారీ ప్లాన్ వేసింది. ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బస చేసిన చోట పార్టీ కోర్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. అధికారం చేపట్టిన తర్వాత ఇంతకాలం ప్రత్యేక హోదా వద్దంటూ, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదని నిరసన దినం చేస్తూ ముఖ్యమంత్రి ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది.

బాబు మోసాన్ని ప్ర‌ల‌కు తెలిపేందుకు అదే రోజు విశాఖపట్నంలో వైసీపీ అధ్వర్యంలో నిరాహార దీక్ష చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కోర్ కమిటీ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొనడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -