Friday, May 3, 2024
- Advertisement -

బాల‌య్య‌పై నాగ‌బాబు పంచ్ నెం 5

- Advertisement -

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాల‌కృష్ణ‌ను వ‌ద‌ల‌డం లేదు. బాల‌య్య‌పై వ‌రుస వీడియోల‌ను విడుద‌ల చేస్తు పెద్ద దూమారం రేపుతున్నారు. తాజాగా మ‌రోసారి బాల‌య్య‌పై ఓ వీడియోను విడుద‌ల చేశాడు నాగ‌బాబు. గతంలో బాల‌య్య ఓ టీవీ చానెల్‌లో మాట్లాడుతు తండ్రి మాతా చార్యుడు , తనయుడు ఆచార్యుడు , తల్లి రామానుజ మతస్థురాలు అల్లుడు పింజారి మరదలు మార్వాడి . సంకర పార్టీ ఒక తోక లేదు ఒక తొండం లేదు , అలగా బలగా జనాన్ని వెంటేసుకొని తిరుగుతున్నా పార్టీలన్ని ఇపుడు చూస్తున్నాం మనం అని కామెంట్ చేశాడు.

ఈ మాట‌ల‌పై బాల‌య్య‌కు కౌంట‌ర్ ఇచ్చాడు నాగ‌బాబు. దీనిపై స్పందించిన నాగ‌బాబు ఇత‌ర జ‌నం అంటే మీకు అంత లోకువుగా క‌నిపిస్తున్నారా? అని ప్ర‌శ్నించారు నాగ‌బాబు.అలగా బలగా జనం ఏంటి..? ఇతర కులాల మీద జాతుల మీద మీకు గౌరవం లేదు. మీ మాటలు వింటుంటే మా తమ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీని ఉద్దేశించి చేసిన‌విగా చేసిన‌విగా అనిపిస్తున్నాయి. కావ‌లంటే మా తమ్ముడును రాజ‌కీయంగా ఏమైనా విమర్శించుకోండి నాకు అభ్యంతరం లేదు.

కాని పార్టీలో తిరిగే వాళ్ల గురించి చుల‌క‌న‌గా మాట్లాడ‌టం త‌ప్ప‌ని ఆయ‌న మండిప‌డ్డారు. మీ అహంకారం ఎంత‌టి స్థాయిలో ఉందో ఈ మాట‌ల‌ను బ‌ట్టి చెప్ప‌వ‌చ్చు. రాజ‌కీయాల గురించి మ‌న‌కెందుకులే అనుకుని ఊరుకున్నాను అంటూ త‌న కొత్త వీడియోలో బాల‌య్య‌పై ఫైర్ అయ్యాడు నాగ‌బాబు.

https://youtu.be/JvJa7RgL2Oc

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -