Wednesday, May 7, 2025
- Advertisement -

ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛానెల్‌కు భ‌జ‌న చేసిన మెగా బ్ర‌ద‌ర్‌

- Advertisement -

మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు కొద్ది రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతున్న సంగ‌తి తెలిసిందే. మై చానల్ నా ఇష్టం అనే ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి రాజ‌కీయ నాయ‌కుల మీద పొలిటిక‌ల్ సెటైర్స్ వేస్తున్నాడు నాగ‌బాబు. నారా లోకేశ్‌, వైఎస్ జ‌గ‌న్‌, చంద్రబాబుల‌పై కామెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచారు. తాజాగా ఆయ‌న ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిని టార్గెట్ చేసుకుని మ‌రో వీడియోను విడుద‌ల చేశారు. ఇటీవ‌ల కాలంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఏపీ మంత్రి నారా లోకేశ్ గురించి ఓ న్యూస్‌ను క‌వ‌ర్ చేసింది. లోకేశ్ దావోస్‌లో పర్యటన గురించి ఏబీఎన్ ఈ న్యూస్‌ను క‌వ‌ర్ చేసింది. ఈ న్యూస్‌లో నారా లోకేశ్‌ను ఆకాశానికి ఎత్తేసింది ఏబీఎన్‌.

మైనస్ 15 డిగ్రీల చలిలోనూ ఆయ‌న రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైయ్యార‌ని ఓ న్యూస్‌ను టెలికాస్ట్ చేసింది ఏబీఎన్‌. ఈ మోదీ గారికి ఏ పనీ పాటా లేదు. మన ఆంధ్రప్రదేశ్ కు ఏ పెట్టుబడి వచ్చినా, ఆయనేమో తీసుకుపోయి గుజరాత్ లో పెట్టించేస్తారన్న‌రని లోకేశ్ మాట్లాడిన‌ట్లుగా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి చూపించింది. ఈ న్యూస్‌పై త‌న ఛానెల్లో స్పందించారు నాగ‌బాబు. ఏబీఎన్ వారు ఎంత చక్కగా న్యూస్ చెబుతున్నారో. మనకు ఎవరికీ తెలియని న్యూస్, అన్యాయం మోదీ గారూ అని అన్నారు.

ఆయ‌న కియా మోట‌ర్స్‌పై కూడా కామెంట్స్ చేశారు. ‘కియా’ కంపెనీ కార్లు ఇంకా తయారు కాలేదు. కొరియా నుంచి తెచ్చిన కార్లను ఊరిలో తిప్పించారు. ఏమో మ‌నకెందుకులే ఏబీఎన్‌లో ఏది చూపిస్తే అది నిజం అంటు రెండు చిడతలను తీసుకుని ఏబీఎన్‌కు భ‌జ‌న చేస్తు ఏబీఎన్ ఛానెల్‌కు సెటైర్లు వేశారు నాగ‌బాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -