మెగా బ్రదర్ నాగబాబు, హీరో బాలకృష్ణను వదలడం లేదు. గత కొద్ది రోజులుగా బాలయ్యను టార్గెట్ చేసుకుని సెటైర్లు వేస్తున్న నాగబాబు ఇప్పుడు వీడియోలను విడుదల చేస్తు డైరెక్ట్‌గానే కౌంటర్స్ ఇస్తున్నాడు. గతంలో తమ కుటుంబాన్ని ఉద్దేశించి బాలయ్య మాట్లాడిన వాటికి సమాధానం ఇస్తు మండిపడుతున్నాడు నాగబాబు. తాజాగా బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమా విడుదల రోజునే బాలయ్యపై ఓ షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేశాడు నాగబాబు.
ఓ సినిమా ఫంక్షన్‌లో బాలయ్య మాట్లాడుతు.. అమ్మాయి కనిపిస్తే ముద్దు అయిన పెట్టాలి లేకపోతే కడుపు అయిన చేయాలి అని వివాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నాగబాబు ఎర్రోడి వీరగాధ అనే టైటిల్‌తో ఓ షార్ట్ ఫిల్మ్‌ని విడుదల చేశాడు. ఈ షార్ట్ ఫిల్మ్‌లో నాగబాబే స్వయంగా నటించడం విశేషం. ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఓ వ్యక్తిని పట్టుకుని కొందరు మహిళలు కొడుతుంటారు. అక్కడే ఉన్న నాగబాబు ఇది చూసి వారిని ఆపే ప్రయత్నం చేయకుండా వెళ్లిపోతాడు. మళ్లీ అదే వ్యక్తిని వేరే సెంటర్‌లో అదే మహిళలు కొడుతుంటే చూసి మనకెందుకులే అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు నాగబాబు.
అలా వెళ్లిపోతున్న నాగబాబు కారుకి అడ్డంగా వచ్చి పడతాడు ఆ వ్యక్తి. సడన్‌గా ఏం జరిగిందో తెలియని నాగబాబు, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఏం జరిగిందని ఆ వ్యక్తిని అడగ్గా.. ఆ వ్యక్తి మాట్లాడుతు.. ”ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని పెద్దలు అన్నారు కదా..అని నేను ముద్దు పెట్టడానికి ప్రయత్నించానని” చెబుతాడు. ఈ మాటలు విన్న వెంటనే నాగబాబు అక్కడ ఉన్న మహిళలను పిలిచి మరి వారి చేత కొట్టిస్తాడు. ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం చూసిన తరువాత టైటల్ రోల్ ప్లే చేసిన బాలయ్యను ఎర్రోడిని చేశాడు నాగబాబు. ఇప్పటికే నాగబాబు మీద గుర్రుగా ఉన్న బాలయ్య అభిమానులు, ఈ వీడియో చూసిన తరువాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి..
- ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!
