Monday, April 29, 2024
- Advertisement -

ఆవిడా మా ఆవిడే సినిమా ఫ్లాష్‌బ్యాక్ ట్విస్ట్‌తో అజ్ఙాతవాసి కథ….. అన్నీ బాగానే ఉన్నాయి….. అదొక్కటే టెన్షన్

- Advertisement -

అజ్ఙాతవాసి సినిమా హంగామా మొదలైంది. అనిరుథ్ మ్యూజిక్ యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ స్టిల్స్ కూడా కిరాక్ పుట్టిస్తున్నాయి. అత్తారింటికి దారేది సినిమాలోలాగే మరోసారి పవన్‌ని యంగ్‌గా భలే ప్రజెంట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. కెమేరామేన్ గంగతో రాంబాబు లాంటి సినిమాల్లో మరీ షేప్ అవుట్ అయిపోయి కనిపించాడు పవన్. అయితే ఒక్క త్రివిక్రమ్ మాత్రం పవన్‌ని హ్యాండ్సమ్‌గా చూపించడంలో సూపర్ సక్సెస్ అవుతున్నాడు. ఇప్పుడు అజ్ఙాతవాసి సినిమాలో పవన్ హ్యండ్సమ్‌గా కనిపిస్తాడన్న వార్లలు వినిపిస్తున్నాయి.

ఆవిడా మా ఆవిడే సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో…యాక్సిడెంట్‌లో టబు చనిపోయిందనుకుని నాగార్జున రెండో పెళ్ళి చేసుకుంటాడు. అలాగే ఈ సినిమాలో కూడా యాక్సిడెంట్‌లో తన మొదటి భార్య చనిపోయిందనుకుని పవన్ తండ్రి రెండో పెళ్ళి చేసుకుంటాడు. ఆ మొదటి భార్య కొడుకే పవన్. పవన్ పెద్దవాడయ్యేసరికి తండ్రి చనిపోతాడు. ఆ తర్వాత తండ్రి బిజినెస్‌లోకి ఎంప్లాయిగా ఎంటరైన పవన్…….ఫైనల్‌గా ఆ సామ్రాజ్యానికి వారసుడిని నేనే అని ప్రకటించుకోవడం……..ఆ తర్వాత వచ్చే సమస్యలు ఏంటి అనేది కథ. ట్విస్ట్‌లతో పాటు త్రివిక్రమ్ మార్క్ సీన్స్ కూడా అదిరిపోతాయని చెప్తున్నారు. అలాగే డైలాగ్స్ కూడా కేకలు పెట్టించడం ఖాయం అంటున్నారు. అయితే సినిమా అంతా కూడా క్లాస్ వ్యవహారంలా ఉంటుందన్న విషయం తెలుస్తోంది. అలాగే అత్తారింటికి దారేది, గబ్బర్‌సింగ్ సాంగ్స్ మాస్ ఆడియెన్స్‌కి భయకంరంగా రీచ్ అయ్యాయి. ఇప్పుడు అనిరుథ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. కానీ మాస్ ఆడియెన్స్ కోరుకునే టేస్ట్‌లో అయితే లేవు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వ్యవహారం కూడా క్లాస్‌గా ఉంటుందట. మరి ఈ క్లాస్ సినిమా మాస్‌కి కూడా కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అయితే మాత్రం పవన్‌కి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాయం. అలా కాకుండా మాస్‌ని అట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అయితే తప్ప బ్రేక్ అవ్వడం కష్టమైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడడం కష్టమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -