Saturday, May 18, 2024
- Advertisement -

దేవదాస్’ ఫస్ట్‌ లుక్ అదుర్స్ : మ‌ంచంపై గ‌న్‌తో నాగ్‌..స్టెతస్కోప్‌తో నాని

- Advertisement -

కింగ్ నాగార్జున, నేచుర‌ల్ స్టార్ నానిల కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘దేవ‌దాస్’ ఫస్ట్ లుక్ వచ్చేసింది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మిస్తోన్న‌ ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ప్రమోషన్స్‌లో భాగంగా కొద్దిసేపటి క్రితం ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు నాగార్జున.

ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందనలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వ‌హిస్తున్నారు.ఈ సినిమా అనౌన్స్ మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే విడుదల చేసిన లోగోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నాగ్ ఓ చేతిలో గన్, మరో చేతిలో మందు బాటిల్ పట్టుకుని ఉండగా, నాని మెడలో స్టెతస్కోప్ వేసుకుని ఉన్నాడు. వీటితోనే వీరిద్దరూ బెడ్ పై నిద్రిస్తున్నారు. సెప్టెంబర్ 27న నిద్రలేవబోతున్నారంటూ పోస్టర్ పై ఉంది.దేవదాస్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని బట్టి నాగార్జున డాన్‌గా, నాని డాక్టర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫొటోను అప్ లోడ్ చేసిన నాగార్జున… ‘సాధారణంగా నా పక్కన పారూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం దాస్ తో చిక్కుకుపోయా’ అంటూ ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -