Tuesday, May 14, 2024
- Advertisement -

రెండు నెలల వ్యవధి లో నాగార్జున సెన్సేషన్

- Advertisement -

ఒకప్పటిలా ఒక హీరో ఒక క్యాలెండర్ ఇయర్ లో 10ల సంఖ్యలో సినిమాలు చేసి హిట్లు కొట్టే రోజులు కావివి, ఒక హీరో మహా అయితే రెండు సినిమాలతో ప్రేక్షకులముందుకు వస్తే అందులో ఒకటి కూడా నికార్సయిన హిట్ అవుతుంది అన్న నమ్మకంలేదు.

అలాంటిది రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలతో వచ్చిన కింగ్ నాగార్జున రెండి౦టితోనూ సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు.ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా ఎవ్వరు ఊహించని విధంగా 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించగా రెండు నెలలు గడిసేలోపు ఊపిరి సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా 25 రోజుల్లో 46 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర 96 కోట్ల షేర్ ని కలెక్ట్ చేశాడు నాగార్జున.ఇలా అతితక్కువ గ్యాప్ లో అన్నేసి కలెక్షన్స్ సాధించిన హీరో టాలీవుడ్ లో ఇప్పటివరకు ఎవరూ లేరనే చెప్పొచ్చు. ఇలాంటి రికార్డుతో టాలీవుడ్ లో ఎవ్వరూ సాధించని కొత్త రికార్డును నాగార్జున సొంతం చేసుకున్నాడు. సినిమా పూర్తి రన్ లో మరో 4 కోట్లు కలెక్ట్ చేస్తే ప్రభాస్ బాహుబలి తరువాత 1 ఏడాది గ్యాప్ లో 100 కోట్లు కలెక్ట్ చేసిన రెండో హీరో అవుతాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -