Sunday, May 12, 2024
- Advertisement -

నాగార్జున ప్రమోషన్ శ్రీకాంత్ తనయుడిని స్టార్ ని చేస్తుందా!

- Advertisement -

ఒకవైపు తన తనయుడిని హీరోగా ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్న హీరో నాగార్జున మరోవైపు తన సహనటుడి తనయుడిని కూడా హీరోగా ప్రమోట్ చేస్తున్నాడు.

తన తనయుడిని మాస్ హీరోగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఈ హీరో ఒక చిన్న సినిమా ద్వారా శ్రీకాంత్ తనయుడిని హీరోగా నిలబెట్టడానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీకాంత్, ఊహల తనయుడు రోషన్ హీరోగా నాగార్జున నిర్మాణంలో ఒక సినిమా రూపొందుతోంది. దాని పేరు “నిర్మలా కాన్వెంట్”. పేరును బట్టే ఈ సినిమా చోటా సినిమా అని అర్థం అవుతోంది. అయితే ఇలాంటి చిన్న సినిమాలతో నాగార్జునకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ప్రొడక్షన్లో వచ్చిన “ఉయ్యాల జంపాలా” సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో వేరే చెప్పనక్కర్లేదు.

ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ల కెరీర్ లు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో శ్రీకాంత్ తనయుడి కెరీర్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. విశేషం ఏమిటంటే.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించబోతున్నాడు. రోషన్ ఫస్ట్ లుక్స్ కు ఇప్పటికే మంచి క్రేజ్ వచ్చింది. తొలి చూపులోనే ఈ కుర్రాడు సినీ అభిమానులను ఆకట్టుకొన్నాడు. తొలి సినిమా విడుదల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -