Friday, May 3, 2024
- Advertisement -

నల్లటి పెదాలతో ఇబ్బంది పడుతున్నారా?

- Advertisement -

పెదాలు ఎర్రగా ఉంటేనే  అందం,ఆకర్షణ ఉంటుంది.

కానీ ఎండలో ఎక్కువగా తిరగటం, కాలుష్యం, అలర్జీలు, అతిగా కాఫీ త్రాగటం, హార్మోన్స్  సమస్యలు

కారణంగా పెదాలు నల్లగా మారతాయి. కొన్ని చిట్కాలను పాటిస్తే మీ పెదాలు ఎర్రగా అందంగా మారతాయి.

 

1. ఒక స్పూన్ పంచదారకు అర స్పూన్ వెన్న కలిపి పెదాలకు రాసి పావుగంట అయ్యిన తర్వాత శుభ్రంగా కడగాలి. పంచదార మృత కణాలను తొలగిస్తే వెన్న పెదాలకు రంగుని ఇస్తుంది. ఈ విధంగా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేయాలి. 

2. నిమ్మలో సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన పెదాలపై నలుపును తగ్గించటానికి సహాయపడుతుంది. దీని కోసం ఒక స్పూన్ నిమ్మరసంలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె,ఒక స్పూన్ పంచదార కలిపి ఈ మిశ్రమాన్ని పెదాలపై రుద్దాలి. కొంత సేపు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

3. బీట్ రూట్ కు నలుపు తగ్గించే గుణాలు ఉన్నాయి. అందువల్ల బీట్ రూట్ రసాన్ని పెదాలకు పట్టించి ఐదు నిముషాలు అయ్యాక శుభ్రం చేసుకుంటే సరి పోతుంది.

4. ఒక స్పూన్ స్ట్రాబెర్రి రసాన్ని రెండు స్పూన్ల పెట్రోలియం జెల్లీతో కలిపి లిప్ బామ్ గా ఉపయోగించిన మంచి పలితం ఉంటుంది.

5. రాత్రి పడుకొనే సమయంలో పెదాలకు ఆలివ్ నూనెను రాసుకుంటే పెదాలు మృదుత్వాన్ని పొందటమే కాకుండా సహజ రంగుకు వస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -