Wednesday, May 7, 2025
- Advertisement -

మ‌రోసారి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్న నాగార్జున‌

- Advertisement -

నాగార్జున హీరోగా 2002 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘మన్మధుడు’ సినిమాకి సీక్వెల్గా నాగార్జున ‘మన్మధుడు 2’ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘చి ల సౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో లక్ష్మీ, దేవదర్శిని, వెన్నెల కిషోర్, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మధ్యనే విడుదలైన టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది అని చెప్పుకోవచ్చు.

పెళ్లి, పిల్లలు వద్దు అనే ఒక ప్లే బోయ్ తరహా పాత్ర లో నాగార్జున అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘మన్మధుడు’ సినిమా లాగానే ‘మన్మధుడు 2’ లో కూడా కామెడీ హైలైట్ అవుతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చేనెల 9వ తారీఖున విడుదల కాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -