నాగార్జున‌కు కాజ‌ల్ గ్రీన్‌సిగ్న‌ల్ !‌

- Advertisement -

హాట్ బ్యూటీ కాజ‌ల్ అగ‌ర్వాల్ కు వెండితెర‌పై ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అలాగే, సోష‌ల్ మీడియాలోనూ ఈ అమ్మ‌డు త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను, సినిమా వివ‌రాల‌ను పంచుకుంటూ త‌న అభిమానుల‌కు మరింత ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. యంగ్ హీరోల‌తో పాటు సీనియ‌ర్ హీరోల స‌రిజోడుగా ఈ అందాల చంద‌మామ తెర‌పై దుమ్మురేపుతుంది. అందుకే సినిమాల్లోకి వ‌చ్చి చాలా కాలం ఆయ‌న ఇంకా టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది.

అయితే, ఇటీవ‌ల త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు గుడ్ బై చెబుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి తొలి రోజుల‌ను విదేశాల్లో బాగా ఏంజాయ్ చేసి.. మళ్లీ వెండితెర‌పై త‌ళుక్కున మెర‌వ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే వ‌రుస సినిమాలు చేయ‌డానికి ప్రాజెక్టుల‌కు ఒకే చెబుతోంది.

- Advertisement -

తాజాగా టాలీవుడ్ మ‌న్మ‌థుడు, యువ సామ్రాట్ నాగార్జున‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. నాగ్ తో క‌లిసి ఓ ప్రాజెక్టు చేయ‌డానికి ఈ ముద్దుగుమ్మ సంత‌కం చేసిన‌ట్టు సినీ వ‌ర్గాల స‌మ‌చారం. భారీ బ‌డ్జెట్ తో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాలో కీ రోల్ పోషించ‌నుంద‌ట కాజ‌ల్. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభంకానుంద‌ట‌. కాగా, త‌మిళంలో తెర‌కెక్కుతున్న‌మ‌రో రెండు సినిమాల‌తో పాటు ఓ బుల్లితెర షో చేయ‌డానికి కాజ‌ల్ ఒకే చెప్పింది.

ర‌జినీ కాంత్ సినిమాపై క‌రోనా దెబ్బ !

కారును ఢీ కొట్టిన విమానం !

మజ్జిగతో బోలెడు లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు !

సందీప్ రెడ్డి డైరెక్ష‌న్‌లో సూపర్ స్టార్ మ‌హేష్‌

మీరు పొగతాగుతారా..? అయితే మీ పిల్లలు క్యాన్సర్‌ బారినపడే అవకాశాలున్నాయి

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -