Saturday, April 27, 2024
- Advertisement -

ఓటీటీలోకి నాగ్..’నా సామిరంగ’!

- Advertisement -

ఈ ఏడాది సంక్రాంతి రేసులో వచ్చిన సినిమా నా సామిరంగ. కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ నిర్మించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కీలక పాత్రలు పోషించారు.

సంక్రాంతి రేసులో విజేతగా నిలిచిన మూవీల్లో ఒకటిగా నిలిచింది నా సామిరంగ. సైలెంట్ కిల్లర్‌గా మంచి వసూళ్లను రాబట్టింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్ స్టార్ లో నా సామిరంగ సినిమా ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ విషయాన్ని హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేసింది. దీంతో థియేటర్లలో నా సామిరంగ మూవీని మిస్ అయినవాళ్లు ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చు. సంక్రాంతి సినిమాలు గుంటూరు కారం నెట్ ఫ్లిక్స్ లో , సైంధవ్ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -