Monday, April 29, 2024
- Advertisement -

యువ ఆటగాళ్లు రోహిత్ కల నెరవేరుస్తారా?

- Advertisement -

అండర్ – 19 వరల్డ్ కప్‌లో భారత్ దూకుడు కొనసాగుతోంది. తిరుగులేని ఫామ్‌తో యువ ఆటగాళ్లు పైనల్‌కు చేరుకోగా రేపు ఆస్ట్రేలియాతో తలపడనున్నారు. దీంతో ఈ ఫైనల్‌లో గెలిచి వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని యువ ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.

గతేడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్ చేతిలో రోహిత్ సేన ఓటమి పాలైన సంగతి తెలిసిందే.ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం రావడంతో అభిమానులు అంతా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కెప్టెన్ ఉదయ సహరన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా అని అడగ్గా రివెంజ్ గురించి అస్సలు ఆలోచించట్లేదన్నాడు. తన మనసులో రివెంజ్ అనేదే లేదని ఫైనల్ ఎలా ఆడాలనేదానిపై తన ముందున్న లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. ఉదయ్ సహరన్, ముషీర్ ఖాన్ భీకర ఫామ్‌లో ఉండగా సౌమ్య పాండే ప్రత్యర్థులను బెంబేలెత్తించే బౌలింగ్ తో రాణిస్తున్నాడు. అటు ఆసీస్ జట్టు కూడా బలంగా ఉండటంతో పైనల్ పోరులో గెలిచేది ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటివరకు టీమిండియా అండర్ 19 వరల్డ్‌ కప్‌ని ఐదు సార్లు గెలవగా ఆసీస్ మూడు సార్లు గెలుపొందింది. 2000లో మహ్మద్ కైఫ్, 2008లో విరాట్ కోహ్లీ, 2012లో ఉన్ముక్త్ చంద్, 2018లో పృథ్వీ షా, 2022లో యశ్ ధుల్ వరల్డ్ కప్ అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -