సోగ్గాడే చిన్ని నాయన సినిమానీ మనం సినిమా నీ తానే స్వయంగా నిర్మించారు హీరో నాగార్జున. తన బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ మీద నాగార్జున ఈ రెండు కథలు నచ్చడం తో భారీ పెట్టు బడి కూడా పెట్టారు.
సోగ్గాడు కి అయితే సినిమా కి కాస్తో కూస్తో రీషూట్ చెయ్యాల్సిన పరిస్థితి కూడా ఎదురు అవ్వడం తో ఆ పని కూడా చేసారు నాగార్జున. తాను నమ్మిన సబ్జెక్ట్ మీద నాగ్ కి ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది మరి.
నాగర్జున కి మంచి బిజినెస్ మ్యాన్ గా కూడా పేరుంది. అలాంటి నాగార్జున ఆ సినిమాను అమ్మకుని లాభాలు పొందాలనుకోవడం లేదు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా…2014 తెలుగు సినిమాకు దొరికిన అద్బుత దృశ్యకావ్యం మనం సినిమా. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా అవ్వడంతో ఈ సినిమాను నాగేశ్వరరావు తీపి గుర్తుగా అందరూ గుర్తుంచుకోవాలని ఆ సినిమా రీమేక్ రైట్స్ ని ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు నాగార్జున. హిందీ లో ఇదే కాన్సెప్ట్ ని రీమేక్ చేస్తే సూపర్ హిట్ ఒస్తుంది అని ఒక బాలీవుడ్ నిర్మాత నాగ్ కి చాలా పెద్ద ఆఫర్ ఇచ్చారట కానీ దాన్ని కూడా నాగ తిరస్కరించారట. ఎన్ని కోట్లు ఇచ్చినా ఇది సాధ్యం కాదు అని నాగార్జున తేల్చి చెప్పడం విశేషం .
