Sunday, May 5, 2024
- Advertisement -

నాగ్‌ ‘ఆఫీసర్‌’కు అమల ట్విట్టర్ రివ్యూ!

- Advertisement -

హీరో నాగ‌ర్జున‌-రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో 28 సంవ‌త్స‌రాల క్రితం వ‌చ్చిన శివ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే.మ‌ళ్లీ ఇన్ని సంవ‌త్సరాల త‌రువాత వీరిద్ద‌రు క‌లిసి తీసిన సినిమా ఆఫీసర్.గ‌త కొంత కాలంగా స‌రైన హిట్లు లేక ఇబ్బంది ప‌డుతున్న వ‌ర్మ‌కు నాగ‌ర్జున అవ‌కాశం ఇవ్వ‌డంతో అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు.

సినిమా టీజ‌ర్‌,ట్రైల‌ర్ కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకొలేదు.దీంతో సినిమాపై ఒక్క నాగ‌ర్జున‌కి త‌ప్ప ఎవ్వ‌రికి పెద్ద‌గా నమ్మ‌కం లేదు.సినిమా ఈ రోజు( జూన్ 1న)విడుద‌లైంది.కాంట్రవర్షియల్ కథలుగా కాకుండా ఒక హీరోయిజం ఉన్న సినిమా చేశాను అని వర్మ ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాపై పాజిటీవ్ రివ్యూస్ అందుతున్నాయి.అందరికంటే ముందుగా నాగార్జున సతీమణి అమల తన మొదటి రివ్యూ ఇచ్చేశారు. బ్రిలియంట్ పెర్ఫెమెన్స్. బ్రిలియంట్ ఫిల్మ్!. నో నాన్సెన్స్ – డైకరెక్ట్ గా చెప్పిన కథ. సినిమాలో సౌండ్ సీటు నుంచి కదలనివ్వకుండా చేస్తుంది.

మొత్తానికి సినిమా అన్ని విధాలా ఆకట్టుకుంది. అందుకు గాను మై స్వీట్ హార్ట్ నాగార్జునకు అండ్ ఆఫీసర్ సినిమా కోసం వర్క్ చేసిన చిత్ర యూనిట్ కి తన విషెస్ అని అమల పోస్ట్ చేశారు.వర్మ అమల ట్వీట్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ అనందపడి పోయాడు. హే థ్యాంక్స్ అమల అంటూ ఓ కామెంట్ కూడా పెట్టాడు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -