Monday, May 13, 2024
- Advertisement -

చేస్తాడా? లేక త‌ప్పుకుంటాడా?

- Advertisement -

కింగ్ నాగ్ త‌న కొడుకు సినిమా విష‌య‌ల‌లో కొంచెం ఎక్క‌వుగా ఆలోచిస్తుంటాడు.అప్పుడు నాగచైత‌న్య విష‌యంలో ఇప్పుడు అఖిల్ విష‌యంలో ఇదేవిధాంగా చేస్తున్నాడు. అఖిల్ మొద‌టి సినిమా ప్లాప్ కావ‌డంతో నిరాశ‌కు గురైన నాగ్ ఎలాగైనా త‌న రెండోవ సినిమా హిట్ కావ‌ల‌ని ఉద్దేశంతో త‌మ అఖినేని కుటుంబానికిమ‌రిచిపోలేని హిట్ ఇచ్చిన విక్ర‌మ్‌ను అఖిల్ సినిమాకు ద‌ర్శ‌కుడిగా తీసుకున్నాడు నాగార్జున‌.అయితే ఇక్క‌డే నాగ్ త‌న ఇన్వాల్వ్ మెంట్ కాస్త ఎక్కువైందని వినికిడి.అయితే అది కొత్త దర్శకుల విషయంలో చెల్లుతుంది. కానీ సీనియర్ దర్శకుల విషయంలో కూడా ఇలానే ప్రవర్తిస్తే ఒకింత చాదస్తమనే చెప్పాలి.

విక్రమ్ సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి. అతడి ట్రాక్ రికార్డ్ కూడా బాగుంది.అలాంటిది ఆ డైరెక్టర్ వర్క్ విషయంలో నాగార్జున ఫింగరింగ్ అతడికి నచ్చడం లేదట. పోస్టర్ నుండి టీజర్ ఇలా ప్రతి విషయంలో నాగ్ జోక్యం చేసుకోవడంతో విక్రమ్ అతడికే వదిలేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఎడిటింగ్ రూమ్ తాళాలు నా దగ్గరే ఉంటాయని చెప్పాడంటే ఇక సీన్ మొత్తం అర్ధం చేసుకోవచ్చు. దీంతో విక్రమ్ వీలైనంత తొందరగా సినిమా షూటింగ్ పూర్తిచేసి బయటపడాలని చూస్తున్నాడు. మరి చైతుతో అనుకున్న సినిమాను పూర్తి చేస్తాడో.. లేక సైలెంట్ గా తప్పుకుంటాడో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -