Monday, May 13, 2024
- Advertisement -

మీడియాపై విపరీతంగా ఒత్తిళ్లు..

- Advertisement -

గతంలో ఎన్నడూ లేనంతగా మీడియా పై ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయని ఛానల్ ఎడిటర్లు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోను ఇతే తంతు కొనసాగుతుంది.ఇంతకు ముందు ఓ రాజకీయ నాయకుడికి చెందిన వార్త సర్కులేట్ అయితే..ఆ సదరు ఛానల్ సిఇఓ,ఇన్ పుట్ ఎడిటర్లకు కాల్స్ వచ్చేవి. కొందరు మొహమాటంతోను ,ఇంకొందరు కొంత సంతోషం మేరకు దానికి లొంగిపోయేవారు. కాని ఇపుడు ఎలక్షన్స్ సమీపిస్తూ ఉండడంతో ఎవ్వరూ ఏ పార్టీ పక్షాన నిలుస్తున్నారో అర్ధం కావడం లేదు. ఒకవేల పైకి ఓ పార్టీ స్టాండ్ తో ఉన్నప్పటికీ వేరే పార్టీ వారికి అందుల్లోను భాగా కావాల్సిన వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇస్తున్నారు.

తాజాగా డిజిటల్ మీడియా ప్రభావం పెరగడంతో ఓ లీడర్ ఇచ్చిన స్పీచ్ లేదా ఇంటర్వ్యూని ఏదో ఒక యూ ట్యూబ్‌లో పెడితే…క్లిక్‌లు భారీగా వస్తే తమకు ఆదరణ మంచిగా ఉందని నమ్ముతున్నారు. అదే ఛానల్ లో తమకు వ్యతిరేకమైన కథనాలు వస్తే బాధపడటం చెందుతున్నారు. కొన్ని సందర్భాలలో తమకు అనుకూల కథనాలు రావడం లేదని వెంటపడటం కూడా పెరిగి పోయింది. ఇపుడు చూస్తున్న ఛానల్లులో కొన్ని ఛానళ్లు…. ఆయా పార్టీలను, ప్రభుత్వాలనూ కాపాడుతున్నాయనే విమర్శలు పెరిగిపోతున్నాయి.

కాకలు తీరిన సీనియర్ పాత్రికేయులుకూడా కనీస స్వేచ్చను కోల్పోతున్నామని వాపోతున్న పరిస్థితి వచ్చిందంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో మాదిరిగా బ్యూరో చీప్‌లు ఎడిటర్ల పాత్ర తగ్గిపోయి నేరుగా యజమానులకే ఫోన్లు పోతున్నాయట. ర్యాంకులతో నిమిత్తం లేకుండా అన్ని సంస్థలకూ ఎదురవుతున్న సమస్య ఇదే.ఈ బాధలు లేకుండా సినిమా తారల గురించి ఆత్మహత్యల వంటి వాటి గురించి లేదంటే పవన్‌ కళ్యాణ్‌లా సినిమా రాజకీయాలు కలబోసిన విషయాల గురించి ఇస్తే రేటింగులైనా పెరుగుతాయని ఛానళ్లు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -