Thursday, May 2, 2024
- Advertisement -

మ‌రో దిగ్గ‌జ న‌టుడి బ‌యోపిక్‌?

- Advertisement -

టాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల జోరు క‌న‌ప‌డుతుంది.మాజీ సీఎంలు ఎన్టీఆర్‌,వైఎస్ఆర్ జీవిత క‌థ‌ల‌ను బ‌యోపిక్‌గా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.హీరోయిన్ సావిత్రి జీవిత క‌థ‌ను కూడా మ‌హ‌న‌టిగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.ఇప్ప‌టికే రీలిజ్ అయిన టీజ‌ర్‌,ట్రైల‌ర్ సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇప్ప‌డు మ‌రో స్టార్ బ‌యోపిక్‌కు రంగం సిద్దం అవుతుంద‌ని తెలుస్తుంది.దిగ్గజ అక్కినేని నాగేశ్వర్ రావు గారి బయోపిక్ కోసం కూడా సన్నాహాలు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్.హీరో నాగ‌ర్జున ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ప‌నుల్లో బిజి బిజిగా ఉన్నాడని స‌మాచారం.

అన్నపూర్ణ ఫిలిం స్కూల్ నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన టీంతో కింగ్ నాగార్జున ఇప్పటికే రీసెర్చ్ చేయిస్తూ విషయ సేకరణ కోసం వాళ్ళను వివిధ ఊళ్లకు పంపినట్టుగా తెలుస్తుంది.రెండు మూడు వ‌ర్ష‌న్స్ రాయించి వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేద్దాం అని నాగ్ ఆలోచ‌న‌. మ‌రి  ఏఎన్నార్ గా  నాగ్ న‌టిస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో అక్కినేని కాంపౌడ్ హీరోలు మొత్తం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు హీరో నాగ‌ర్జున‌. ఈ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ లోనే ఇది రూపొందించే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఇంత వ‌రుకు అఫిషీయ‌ల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -