Saturday, April 20, 2024
- Advertisement -

శ్రీరెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌..

- Advertisement -

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌డంలేద‌ని క్యాస్ట్ కౌచింగ్ పెరిగిపోయింద‌నీ కొన్నిరోజుల క్రితం ఫిల్మ‌ఛాంబ‌ర్ ముందు అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో వార్త‌ల్లో నిలిచింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి క్యాస్ట్ కౌచింగ్ వ్యాఖ్య‌ల‌పై బాలీవుడ్ స్టార్ కొరియో గ్రాఫ‌ర్ సరోజ్ ఖాన్ స్పందించారు.

ప్రతిభ ఉన్న ఏ అమ్మాయి అయినా తనను తాను అమ్ముకోవాలనుకోదు కదా? అంటూ ప్ర‌శ్నించింది. సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది బాబా ఆజాం కాలం నుంచీ ఉన్న సమస్య అని అన్నారు. కేవలం సినీ పరిశ్రమలోనే ఇది జరుగుతుందని అనడం సరికాదని ఆమె సూచించారు. ఇది యావత్ సమాజానికి సంబంధించిన వ్యవహారమని, ప్రభుత్వ శాఖల్లో కూడా వేధింపుల ఉదంతాలు ఉన్నాయి కదా? అని ఆమె గుర్తుచేశారు.

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌ను సమర్ధించిన సరోజ్ ఖాన్, ఇది మీ జీవనోపాధికి మార్గం సూచించే హామీ ఇస్తుంది.. దీన్ని అత్యాచారంగా ఎలా భావిస్తారని నిలదీసింది. బాలీవుడ్‌లో శ్రీదేవి, మాధురీ దీక్షిత్ లాంటి గొప్ప నటులతో కలిసి ఈ లెజెండరీ కొరియోగ్రాఫర్ పనిచేశారు. అవకాశాల కోసం మనం ఒకరికి అమ్ముడుపోవాలా? ఒకరిచేతుల్లో బందీకావాలా? అని ఎవరికివారే ఆలోచించుకోవాలని ఆమె సూచించారు.

మన దగ్గర టాలెంట్‌ ఉంటే అలాంటి వాటికి ఎందుకు అంగీకరించాలి? అని ఆమె ప్రశ్నించారు. కనిపించిన ప్రతి ఆడపిల్లపైనా చెయ్యివెయ్యాలని ఎవరో ఒకరు చూస్తునే ఉంటారని ఆమె చెప్పారు. అన్నంపెట్టే సినీ పరిశ్రమపై బురదచల్లాలని చూడొద్దని ఆమె హితవు పలికారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -