Tuesday, May 7, 2024
- Advertisement -

చైతు.. సమంతల పెళ్లికి.. నాగ్ ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా..?

- Advertisement -

ఏమాయ చేసావె.. సినిమాతో తెలుగులోకి పరిచయం అయిన సమంత.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అక్కినేని ఫ్యామిలీలోకి అడుగు పెట్టనుంది. ఇప్పుడు ఇదే విషయంపై అందరిలో ఆసక్తి కలుగుతోంది. చైతూ-సమంత తమ లవ్.. పై అందరి చేత పాజిటివ్ కామెంట్స్ ని అందుకున్నారు ఈ లవర్స్. ఇన్నిరోజులు ప్రేమలో ఉన్న ఈ ప్రేమికులు.. ఇప్పుడు ఒకటవ్వబోతున్నారు. అక్టోబర్ 6న పెళ్లి చేసుకోనున్నారు.

ఇక సమంత కూడా తొందరగ పెళ్లి చేసుకొని.. అక్కినేని ఇంట్లో కోడలిగా అడుగుపెట్టేందుకు ఎదురు చూస్తోంది. ఇప్పటికే సమంత అక్కినేని ఫ్యామిలీకి చాలా దగ్గర అయ్యింది. నాగార్జున ని సోషల్ మీడియాలో మామ అని సంబోధిస్తూ.. తన ఆప్యాయతను చాటుకుంటోంది. అలానే అక్కినేని ఫ్యామిలీ కూడా సమంత మా ఇంటి కోడలిగా ఎప్పుడు అడుగుపెడుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. అయితే నాగార్జున వారికి పెళ్లి కాగానే.. ఓ సూపర్ సప్ ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఆ పనులను కూడా మొదలు పెట్టేశాడట నాగ్.

ఇంతకీ అదేమిటి అనుకుంటున్నారా? అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోలో ఒక మంచి కాటేజ్ ని నిర్మించి కొత్త జంటకి కానుకగా ఇవ్వనున్నాడట నాగ్. ప్రస్తుతం దీనిని.. చాలా ఖరీదైన మెటీరియల్ తో తయారు చేస్తున్నాడట. అందుకు సంబందించిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూడాలి మారి ఈ ఊహించని గిఫ్ట్ కి చైతు-సామ్ ఎలా సంబరపడతారో. ఈ కాటేజ్ అస్తమానం ఉండటానికి కాదు కాని.. షూటింగ్ జరిగే టైములో అక్కడే ఉండిపోవడానికి. ఏది ఏమైన నాగ్ మంచి సర్ ప్రైజ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -