Sunday, April 28, 2024
- Advertisement -

ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన వ‌ర్మ‌.. అక్కినేని అఖిల్‌తో సినిమా

- Advertisement -

ప్ర‌స్తుతం అక్కినేని నాగార్జున‌తో ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఆఫీస‌ర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నాగ్ త‌న‌యుడు అఖిల్‌తో సినిమా చేస్తాన‌ని ఇంట్రెస్టింగ్ న్యూస్ వ‌ర్మ ప్ర‌క‌టించాడు. మొద‌టిది అట్ట‌ర్ ఫ్లాప్‌.. ఆ త‌ర్వాతి సినిమా సోసో ఆడ‌డంతో ఆందోళ‌న‌లో ఉన్న అక్కినేని అఖిల్‌ను వ‌ర్మ కొంచెం బూస్ట్ ఇస్తాడ‌ని నాగార్జున బ‌లంగా న‌మ్ముతున్నాడు. అందుకే వ‌ర్మ‌ అఖిల్‌తో సినిమా చేయించ‌డానికి బాగా ఒప్పించాడు.

అయితే ప్ర‌స్తుతం అఖిల్ త‌న మూడో సినిమాల‌ను ఇటీవ‌ల మొద‌లుపెట్టాడు. తొలిప్రేమ అని తొలి సినిమాతోనే సూప‌ర్‌హిట్ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొన్న‌నే ప్రారంభ‌మైంది. ఈ సినిమా మేలో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

25 ఏళ్ల తరువాత నేను నాగార్జున‌తో ఆఫీసర్ సినిమా నిర్మిస్తున్నా. ఇక ఫైనల్‌గా అఖిల్ నాల్గో సినిమాను నాగ్ నిర్మిస్తుండగా నేను ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నాను అని వర్మ ట్వీట్ చేశాడు. అప్పట్లో వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం చేసిన శివ సినిమాని నాగ్ నిర్మించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -