- Advertisement -

శ్రీరెడ్డి లీక్స్ 2 : ఆ నిర్మాత బాగోతాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన శ్రీరెడ్డి

- Advertisement -

సుచీలీక్ష్ ఏవిధంగా త‌మిళ‌సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌కంప‌న‌లు రేపిందో ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా శ్రీరెడ్డి లీక్స్ కూడా అదే విధంగా ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. త‌న‌ను వాడుకొని ఎవ్వ‌రూ సినిమా అవ‌కాశాలు ఇవ్వ‌లేద‌ని టీవీ ఛాన‌ల్ల‌లో ర‌చ్చ రచ్చ చేసిన సంగ‌తి తెలిసిందే.

తెలుగు సినిమా పరిశ్రమలోకి కొత్తగా వచ్చే అమ్మాయిల్ని అవకాశాలపేరుతో లోబరుచుకునే నిర్మాతలు, హీరోలు, దర్శకుల పేర్లను బహిర్గతం చేస్తానంటూ మీడియాకెక్కిన శ్రీరెడ్డి తన వద్ద ఉన్న ఆధారాలను ఒక్కొక్కటిగా బయటపెడుతుంది. మంగళవారం తనతో సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి ఫోటోను ఫేస్‌బుక్ ద్వారా విడుదల చేసి ‘శ్రీరెడ్డి లీక్స్ స్టార్ట్స్’ అంటూ సంచలనం రేపిన శ్రీరెడ్డి తాజాగా మరో నిర్మాత పేరుతో పాటు అతడితో చేసిన వాట్సాప్ చాట్‌ను లీక్ చేసింది.

https://www.facebook.com/iamsrireddy/posts/2082377172009204

రవితేజతో ‘మిరపకాయ్’, బాలకృష్ణతో ‘శ్రీమన్నారాయణ’, నానితో ‘పైసా’ లాంటి చిత్రాలతో పాపులర్ అయిన నిర్మాత రమేష్ పుప్పాలతో ఉన్న భాగోతాన్ని బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. ‘చాటింగ్‌లో తెలియడం లేదా డార్లింగ్.. ఇతనికి టైపింగ్ రాదు అంటే సింగిల్ హ్యాండ్ సోగ్గాడు.. ఓ యాక్సిడెంట్‌లో రెండో చేయి పోయింది’ అంటూ కామెంట్ చేస్తూ.. శ్రీరెడ్డితో రమేష్ పుప్పాల చేసిన రొమాంటిక్ చాట్‌ స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కాగా గత రెండు రోజులుగా వస్తున్న శ్రీరెడ్డి లీక్స్‌ టాలీవుడ్‌లో క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఎప్పుడు ఎవరి పేరును శ్రీరెడ్డి లీక్స్ పేరుతో బయటపెడుతుందోనని ఆమెతో సన్నిహితంగా ఉన్న టాలీవుడ్ ప్రముఖుల్లో వ‌ణుకు మొదలైంది. మరి రేపు ఎలాంటి బాంబ్ పేల్చబోతుందో శ్రీరెడ్డి.

https://www.facebook.com/iamsrireddy/posts/2082388932008028

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -