Saturday, April 27, 2024
- Advertisement -

నాగార్జున కోసం వెయిట్ చేస్తున్న దర్శకుడు

- Advertisement -

అక్కినేని నాగేశ్వర రావు గారి తనయుడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వాటిని తట్టుకుని ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా ఎదిగారు నాగ్. ‘శివ’ లాంటి కల్ట్ సినిమాలలో నే కాక ‘మన్మధుడు’ వంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో సైతం తన ప్రతిభను చాటుతూ వచ్చిన నాగ్ ‘అన్నమయ్య’ వంటి డివోషనల్ చిత్రాలలో సైతం మనల్ని మెప్పించారు. తాజాగా నాగార్జున ఇటీవలే తన 60 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు నాగ్ కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు కూడా.

అభిమానులు మాత్రమే కాక పలు సెలెబ్రిటీలు కూడా నాగార్జున కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. మరోవైపు సినిమాల పరంగా చూస్తే, ఈ మధ్యనే ‘మన్మధుడు’ సినిమా సీక్వెల్ గా ‘మన్మధుడు 2’ సినిమాలో కనిపించారు కానీ ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.

తాజాగా నాగ్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా సీక్వెల్ గా ‘బంగార్రాజు’ సినిమాలో నటిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సమంత కూడా ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపిస్తుంది అని టాక్ ఉంది కాని అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాలేదు. ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది కానీ నాగార్జున మాత్రం ఇంకా రాలేదు. దర్శకుడు ఎప్పుడో రెడీ గా ఉన్నా కానీ నాగార్జున ఇంకా రాకపోవడం తో ఈ సినిమా మరింత ఆలస్యం కానుంది అని టాక్ నడుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -