Saturday, April 27, 2024
- Advertisement -

60 యేళ్ల వ్యక్తితో నమిత రొమాన్స్..!

- Advertisement -

నమిత మరో సంచలన పాత్రలో కనిపించడానికి సిద్ధం అయ్యింది. ఈ భారీ అందాల భామ ఇప్పటికే వ్యాంప్ తరహా పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే.

తమిళ, తెలుగు సినిమాల్లో ఇలాంటి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొన్న ఈ సూరత్ భామ.. ఇప్పుడు మరో రకంగా కుర్రకారులో అలజడి పుట్టించడానికి రెడీ అవుతోంది. త్వరలో  నమిత ముఖ్యపాత్రలో రాబోయే ‘మిడత’ అనే సినిమాలో ఆమె 60 యేళ్ల వ్యక్తితో రొమాన్స్ చేస్తుందట!

కథాంశం ప్రకారం.. 60 యేళ్ల వ్యక్తిని నమిత వివాహం చేసుకొంటుందట. మరి యుక్త వయసులో ఉన్న ఒక అమ్మాయి  ముసలి వ్యక్తిని వివాహం చేసుకొంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే అంశం గురించి ఆ సినిమాలో చర్చించనున్నారట. అయినా కథాంశం ప్రకారం ఏమీ కొత్తది కాదు. ఇప్పటికే ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. అయితే దీంట్లో నమిత ప్రధాన పాత్ర చేస్తుండటమే విశేషం. నమితను చూపిస్తూనే ఈ సినిమాను మార్కెట్ చేసుకోవాల్సి ఉంటుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -