Friday, April 19, 2024
- Advertisement -

ఈనెల 24న న‌మిత వివాహం

- Advertisement -

ప‌లు ప్ర‌త్యేక పాటలు, పాత్ర‌ల్లో న‌టించి మెప్పించిన న‌మిత త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోంది. త‌న ప్రియుడి వీరేంద్ర చౌద‌రితోనే వివాహం కానుంది. ఈ విష‌యాన్ని న‌మిత సామాజిక మాధ్య‌మంలో ప్ర‌క‌టించింది. అంతేకాకుండా త‌న వివాహ ప‌త్రిక‌ను పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. సంగీత్ వేడుక నవంబర్ 22వ తేదీన సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు తిరుపతి సింధూరి పార్క్ హోటల్‌లో జరగనుంది. నవంబర్ 24న‌ శుక్రవారం తిరుపతి‌లోని ఇస్కాన్‌లో తెల్ల‌వారుజామున 5.30 నిమిషాల శుభ ముహుర్తాన తాళి క‌ట్టించుకోబోతోంది.

అయితే త‌న‌కు కాబోయే భ‌ర్త గురించి ఆమె పలు విష‌యాలు పంచుకుంది. వీరేంద్ర త‌న బెస్ట్‌ ఫ్రెండ్, సోల్ మేట్ అని తెలిపింది. అతనొక నిర్మాత, అభిలాష ఉన్న నటుడిగా చెప్పింది. త‌మ‌ది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమ‌ని ఆనందం వ్య‌క్తం చేస్తోంది. గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో త‌మ స్నేహితుడు శశిధర్ బాబు ద్వారా ప‌రిచ‌య‌మైన వీర్‌తో స్నేహం బలపడింది. ఈ యేడాది సెప్టెంబర్ 6న బీచ్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్‌లో అత‌డు తనకు ప్రపోజ్ చేయ‌డంతో ప‌డిపోయాన‌ని పేర్కొంది. త‌మ జీవిత ఆశయాలు, ఆధ్యాత్మిక చింతన ఒక్కటి చేశాయని, అభిరుచులు, అభిప్రాయాలు ఒకటే కావ‌డంతో తాము ఒక్క‌ట‌వుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -