Thursday, April 25, 2024
- Advertisement -

అర్జున్‌రెడ్డి‌ని మించి.. నియ్యమ్మ అనేవాడొచ్చాడు… నీతుల బ్యాచ్ ఎక్కడ? రోజాను తిట్టేవాళ్ళు ఎక్కడ?

- Advertisement -

ఎవరైనా చేస్తే వ్యభిచారం…….పచ్చ బ్యాచ్ చేస్తే సంసారం అనే నీతి మన తెలుగు భజన మీడియాకు భలే సరిపోతుంది. ఇక ఆ భజన మీడియా ఆలోచనలకు తగ్గట్టుగా రెచ్చిపోయి నీతులు చెప్పే బ్యాచ్ అంతకంటే ఘోరం. మేధావుల ఫోరం అని, కొన్ని మహిళా సంఘాలు అని పేర్లెట్టుకు తిరుగుతూ పచ్చ బ్యాచ్ వ్యతిరేకులపై విమర్శలతో విరుచుకుపడతారు. అర్జున్‌రెడ్డి సినిమాపై నానా యాగీ చేశారు. ఇక జబర్ధస్త్ గురించి, రోజా గురించి ఎన్ని అవాకులు, చెవాకులు పేలారో లెక్కేలేదు. ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే ఆ ప్రోగ్రాం మూల పురుషుడు, ఈటీవీ అధినేత రామోజీరావును మాత్రం ఎవ్వరూ ఒక్క మాట కూడా అనరు.

ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఆ పచ్చ బ్యాచ్ హీరో బాలకృష్ణ వచ్చాడు. ట్రైలర్‌లోనే నియ్యమ్మ అంటూ రెచ్చిపోయాడు. ఇక సినిమాలో ఏం ఉన్నాయో తెలియదు. మరి ఆ నీతులు చెప్పే పచ్చ బ్యాచ్ ఎక్కడ? తమ వాడు అయ్యేసరికి నియ్యమ్మ అన్న పదం కూడా సంస్కారవంతంగా వినిపిస్తోందా? ఇదే డైలాగ్ చిరంజీవి సిినిమాలో ఉండి ఉంటే ఈపాటికి లైవ్ డిస్కషన్స్‌తో ఉతికి ఆరేసేవాళ్ళు కాదా? ఖైదీ నెంబర్ 150లో కాజల్‌తో రొమాన్స్ ఏంటి అని అడిగినవాళ్ళు ఎక్కడ? జైసింహలో టీనేజ్ హీరోయిన్, తెలుగమ్మాయి హరిప్రియతో బాలయ్యగారి రొమాన్స్ కనిపించడం లేదా? అర్జున్‌రెడ్డి విరుచుకుపడ్డారుగా……జైసింహా గురించి ఏమంటారు? అర్జున్‌రెడ్డి సినిమాలో అయినా కనీసం ఏదో సందర్భం ఉంది……అమ్మాయిలను హింసించినవాడిని తిట్టాం అని వాళ్ళు చెప్పారు. జైసింహాలో ఏం ఉంటుంది? మహా అయితే ఒక విలన్‌ని బాలయ్య తిట్టడం……అంతే. ఇక ‘నియ్యమ్మ’ అనే డైలాగ్ సాక్షాత్తూ శాసనసభ సభ్యుడు అయిన బాలకృష్ణ నోటి నుంచి వచ్చిన తర్వాత జబర్దస్త్ ఆది బూతు జోకులు కూడా నీతులు అయిపోవా? ఇప్పుడు బాలయ్యను తప్పు పట్టకుండా ఉండేవాళ్ళకు జబర్ధస్త్ గురించి మాట్లాడే అర్హత ఉంటుందా? మహిళా సంఘాలు ఎక్కడ? టివి9 వారికి బాలయ్య నియ్యమ్మ డైలాగ్ కమ్మగా వినిపించిందా?

నీతులు చెప్పడం ఏముంది సామీ…..నాలుగు ముక్కలు మాట్లాడడం వచ్చిన ప్రతివాడూ వాగుతాడు…..పాటించాలంటేనే చాలా చాలా ఉండాలి. అవి లేనప్పుడు కనీసం మౌనంగా ఉంటే మర్యాద. అలా కాకుండా ఎదుటి వాళ్ళకు నీతులు చెప్తాం……ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం……మేం చేస్తే చక్కనైనా సంసారం అని చెప్పుకుంటూ ఉంటేనే……———- అని అంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -