Monday, May 13, 2024
- Advertisement -

భార‌త్‌ను ఓడించ‌డానికి వ్యూహాలు సిద్ధం…సౌత్ ఆఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్

- Advertisement -

జనవరి 5 నుంచి భారత్ జట్టు సఫారీ గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. స‌ఫారీల‌ను సొంత గ‌డ్డ‌పై ఓడించ‌డం అంటే అంత తేలికైన పనికాదు. భారత్ జట్టుని ఓడించేందుకు ఇప్పటి నుంచే తాము వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ వెల్లడించాడు.

జింబాబ్వేతో మంగళవారం నుంచి ప్రయోగాత్మకంగా నాలుగు రోజుల ఏకైక టెస్టు మ్యాచ్‌ని దక్షిణాఫ్రికా ఆడనుంది. ఈ నేపథ్యంలో సోమవారం డుప్లెసిస్ మీడియాతో మాట్లాడాడు. డేల్ స్టెయిన్ పునరాగమనం జట్టుకి అదనపు బలం చేకూర్చిందని కెప్టెన్ ధీమా వ్యక్తం చేశాడు.

‘భారత్ జట్టుని టెస్టు సిరీస్‌లో ఓడించేందుకు ఇప్పటికే నుంచే మేము వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. ఇందులో భాగంగా జట్టులో సమతూకం తెచ్చేందుకు తుది జట్టు ఎంపికపై కసరత్తు చేశాం. పునరాగమనం‌‌తో జట్టు బౌలింగ్‌ విభాగాన్ని నడిపించే బాధ్యతను మళ్లీ స్టెయిన్ తీసుకోనున్నాడు.

అయితే అతను గాయం నుంచి 100 శాతం కోలుకుంటేనే జింబాబ్వేతో టెస్టులో ఆడిస్తాం. లేదంటే.. భారత్‌తో టెస్టు సిరీస్‌‌ వరకు విశ్రాంతినిస్తాం. నేను కూడా వెన్నునొప్పి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మంగళవారం జరిగే టెస్టులో నేను ఆడే అవకాశాలు 60-40 మాత్రమే’ అని డుప్లెసిస్ వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -