Saturday, May 4, 2024
- Advertisement -

ఇలా అయితే కష్టం బాలయ్య బాబు

- Advertisement -

సినిమా ప్రారంభం చేసేటప్పుడే విడుదల తేదీ ని ప్రకటించడం బాలీవుడ్ సినిమా పరిశ్రమ లో అనాది గా ఒక సాంప్రదాయం గా వస్తుంది. అక్కడ బాలీవుడ్ లో సినిమాలకి చేసే దర్శకులు నిర్మాతలు అంతా టైం అంటే టైం అని వాళ్ళ పనిని సక్రమం గా చేసుకుంటూ వేరే యావ లేకుండా చేసుకుంటూ పోతారు కాబట్టి విడుదల తేదీ ని రీచ్ అయ్యి చెప్పిన టైం కి సినిమా ని ప్రేక్షకుల దారికి చేరుస్తారు. ఇటీవలే తెలుగు లో కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్న కొందరు నిర్మాతలు వాయిదాలు లేకుండా సినిమా ని చెప్పిన టైం కి విడుదల చేసిన దాఖలాలు తక్కువే. ఎవరో ఒకరు ఇద్దరు మాత్రం అనుకున్న టైం కి కచ్చితం గా సినిమా రెడీ అయేలా చూసుకుంటున్నారు. మిగిలిన వాళ్ళు టెన్షన్ పడుతూ, వాయిదాలు వేస్తూ, వేరే వాళ్ళని కూడా డైలమా లో కి నెడుతున్నారు.

ప్రస్తుతం రానున్న సంక్రాంతి సీజన్ చుట్టూఓ ఇలాంటి డైలమా నే సంతరించుకుంది. నందమూరి బాలకృష్ణ గత కొద్ది సంవత్సరాలు గా సంక్రాంతి కి ఏదో ఒక సినిమా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా కేఎస్ రవికుమార్ తో చేసే సినిమా ని జూలైలో స్టార్ట్ చేసి దసరాకు విడుదల చేయాలని ప్లాం చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ని సంక్రాంతి కి అనుకున్నారు కానీ బాలయ్య సంక్రాంతి కి వేరే దర్శకుడితో వద్దాం అని ఆలోచిస్తున్నాడట.

అయితే బోయపాటి శ్రీను చెప్పిన కథలు వద్దు అని చెప్పి అయన తో కొత్త కథ రాయమని, ఇప్పుడేమో కథ ని పూర్తి చేయమని టైం ఇవ్వకుండా తొందర పెడుతున్నాడట. ఇదే ధోరణి కొనసాగితే ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం పక్కన ఉంచితే అసలు అభిమానుల ని మెప్పించే తరహా లో ఉంటుందా ఉండదా అనే టెన్షన్ ఏ ఎక్కువ అవుతుంది. మరి బాలయ్య తన మనసు మార్చుకుంటారా లేదా చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -