Tuesday, May 14, 2024
- Advertisement -

చంద్ర‌బాబ‌కు భాజాపా బిగ్ షాక్‌…..ఏపీలో త్వ‌ర‌లో టీడీపీ ఖాలీ..

- Advertisement -

ఇటీవ‌లి జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాభ‌దం చంద్ర‌బాబ‌ను వెంటాడుతోంది. ఎన్న‌డూలేని విధంగా బాబు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. అడ్డంగా ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించిన బాబుకు అదే ఫిరాయింపులు కంటిమీద నిద్ర‌లేకుండా చేస్తున్నాయి. ఇత‌ర పార్టీల్లోకి వెల్తున్న నాయ‌కుల‌ను ఏమ‌న‌లేని దీన స్థితిలో ఉన్నారు. టీడీపీనుంచి 7 ఎంపీలు భాజాపాలోకి వెల్లేందుకు సిద్ద‌మ‌య్యారు. బాబు విదేశాల‌నుంచి వ‌చ్చేలోపు టీడీపీ కుదేల‌వుంతుంద‌ని భాజాపా నేత విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు.

భాజాపాలోకి వెల్లే ఎంపీల‌ల్లో ప్ర‌ధానంగా విజయవాడ ఎంపీ కేసినేని నానితోపాటూ… ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని తెలిసింది. ఎలాగూ ఐదేళ్లపాటూ టీడీపీ అధికారంలోకి రాదని భావిస్తున్న ఎంపీలు… అప్పటివరకూ ప్రతిపక్షంలో ఉండే కంటే… బీజేపీలోకి వెళ్లిపోవడం బెటరని లెక్కలేసుకున్నట్లు సమాచారం.

టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి టీడీపీని వదిలి వెళ్లిపోతారని తెలిసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వాళ్లతో చర్చిస్తున్నారని సమాచారం. ఐదుగురు వెల్లిపోతె ఇక టీడీపీకీ మిగిలింది ఒక్క‌రే.టీడీపీ అధినేత చంద్రబాబుపై పీకల దాకా కోపంగా ఉన్న ఆ పార్టీ ఎంపీ కేసినేని నానీ… బీజేపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయమని తెలిసింది.

చంద్రబాబు విదేశాల నుంచి వచ్చేలోపు ఏపీ ముఖచిత్రం మారిపోతుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు భాజాపా నేత విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి. ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్, జనసేన నుంచే ఈ చేరికలు ఉంటాయని వ్యాఖ్యానించారు. పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చాలామంది బీజేపీవైపు చూస్తున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే టీడీపీ ఖాలీ అవ‌డం మాత్రం గ్యారెంటీ. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన బాబుకు ఇలాంటి ప‌రిస్థితి దాపురించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -